Home » ఏపీలో టీడీపీ పతనానికి చినబాబే కారణం అవుతున్నాడా.. ఏం జరుగుతుందంటే..?

ఏపీలో టీడీపీ పతనానికి చినబాబే కారణం అవుతున్నాడా.. ఏం జరుగుతుందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి హవా కొనసాగుతోంది. చాలా ఏళ్ల నుంచి కొనసాగిన టిడిపి ప్రభుత్వం రోజురోజుకు నీరుగారి పోతోంది. దీంతో టిడిపి నాయకత్వం కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తోంది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని అడుగులు వేస్తోంది. ఈ తరుణంలోనే పార్టీలో ఒక ప్రశ్న అందరినీ వేధిస్తుంది. చంద్రబాబు తర్వాత పార్టీని కాపాడేది ఎవరు అనే ప్రశ్నకు జవాబు కూడా దొరకడం లేదు. చంద్రబాబు తనయుడు లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఆయన గట్టెక్కించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అసలు రాజకీయాలపై అవగాహన లేదని, అసలు ఆయనకు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే ఆలోచన కూడా లేదని కొంతమంది టిడిపి నాయకులు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను లోకేష్ క్యాష్ చేయలేకపోతున్నారని వాదన వినిపిస్తోంది. ఈ తరుణంలో లోకేష్ కు పగ్గాలు ఇవ్వాలంటే చంద్రబాబు భయపడుతున్నారు అని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ సొంతంగా గెలిచే క్యాడర్ ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు అంటే, పార్టీలో ఉన్నటువంటి యువ నాయకత్వం పై చంద్రబాబుకు అనుమానాలు ఉన్నాయని కామెంట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా కానీ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంచాయతీ విషయాన్ని లోకేష్ పైనే పెట్టారని తెలుస్తోంది. ఈ కారణం వల్లనే మొన్న మహానాడు లో వరుసగా మూడు సార్లు ఓడిపోయిన వారికి మళ్లీ సీట్లు ఇచ్చేది లేదని లోకేష్ ప్రకటించారని టాక్ కూడా వినిపిస్తోంది. అయితే 2024 ఎన్నికల్లో పార్టీని ముంచినా లేపిన అది లోకేష్ మాత్రమే కారణం అవుతారని టిడిపి నాయకులు భావిస్తున్నారు. అయితే నారా లోకేష్ ప్రజల్లోకి వెళ్లాలని దీని కోసం పాదయాత్ర కూడా చేపట్టనున్నట్టు సమాచారం. అయితే ఈ పాదయాత్ర ప్రోగ్రాం ను అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది.

Advertisement

ALSO READ;

Advertisement

స‌మాధుల‌పై బార్‌కోడ్‌.. ఎక్క‌డంటే..?

టీవీ షోలు చేసి నాగబాబు ఇన్ని కోట్లు సంపాదించారా.. ఆయన ఆస్తుల విలువ ఎంతంటే..?

 

Visitors Are Also Reading