Home » పెళ్లి పీటలు ఎక్కనున్న జబర్దస్త్‌ పవిత్ర.. వరుడేవరంటే!

పెళ్లి పీటలు ఎక్కనున్న జబర్దస్త్‌ పవిత్ర.. వరుడేవరంటే!

by Bunty
Ad

Jabardasth Pavithra: తెలుగు బుల్లితెర చరిత్రలో సుదీర్ఘకాలంగా ప్రసారమవుతున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా తొమ్మిది విలువ టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తున్న ఈ కార్యక్రమం, అప్పటికి ఇప్పటికి ఒకే రకమైన రెస్పాన్స్ ను అందుకుంటూ దూసుకుపోతోంది. తద్వారా భారీ స్థాయిలో టిఆర్పి రేటింగ్ ను సైతం రాబడుతోంది. ఈ కార్యక్రమానికి పోటీగా ఎన్నో వచ్చినప్పటికీ అవన్నీ దీని ప్రభావానికి తట్టుకోలేక మధ్యలోనే ఆగిపోయాయి.

READ ALSO : డబుల్ సెంచరీ చేసిన హీరోలు..4 గురు ఇండియన్సే

Advertisement

Jabardasth Pavithra

Jabardasth Pavithra

అంతాల ప్రతివారం సరికొత్త కంటెంట్ తో జబర్దస్త్ ప్రసారం అవుతుంది. అయితే, జబర్దస్త్ కామెడీ షోలో లేడీ కమెడియన్లు కూడా ఉన్నారు. ఇమ్మానుయేల్ తో జోడి కట్టి ఫేమస్ అయిన వర్షతో పాటు ఈ మధ్యే మరో అమ్మాయి కూడా జబర్దస్త్ కామెడీ షోలో చాలా హంగామా చేస్తుంది. ఆమె పేరు పవిత్ర. చూడ్డానికి నాలుగు అడుగులే ఉంటుంది. కానీ అమ్మాయి వేసే పంచులు మాత్రం ఆరడుగుల కంటే పైనే పేలుతున్నాయి. అయితే జబర్దస్త్ పవిత్ర, తేజ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇప్పుడు ఆకస్మాత్తుగా మా పెళ్లి షాపింగ్ అంటూ వీడియో షేర్ చేయడంతో నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

మా పెళ్లి షాపింగ్ అంటూ హెడ్డింగ్ పెట్టి, జబర్దస్త్ తేజ తో కలిసి వీడియోలో కనిపించింది. పవిత్ర మాకు పెళ్లి కుదిరింది. అందుకే పెళ్లి చీరల కోసం షాపింగ్ చేయడం కోసం వచ్చామంటూ తేజ చెప్పగా, ఊరికే అంటూ సైగలు చేసింది పవిత్ర. షాపింగ్ చేసినంత సేపు తన వరుస పంచులతో పవిత్రను ఓ ఆటాడుకున్నాడు తేజ. తన కామెడీతో ఎంత చిరాకు తెప్పించిన పవిత్ర ఓపికతో షాపింగ్ చేసి, తేజకు తెలియకుండా అతని కార్డుతోనే బిల్లు కట్టింది. అయితే తేజ కామెడీ, పవిత్ర రియాక్షన్స్ చూస్తే మాత్రం ఇది కేవలం ప్రమోషన్ వీడియో అని, వీరిద్దరికీ పెళ్లి అనేది నిజం కాదని అర్థమవుతుంది. దీంతో వీరిద్దరూ తీరుపై విమర్శలు చేస్తున్నారు నెటిజన్స్.

READ ALSO : ఒక సారి వాడిన వంట నూనెను మళ్ళీ వాడుతున్నారా..?అయితే, ప్రాణాలకే ముప్పు తప్పదా !!

Visitors Are Also Reading