Home » ప్రభాస్ పెళ్లిని అతనే చెడగొడుతున్నారా.. అసలు నిజం బయటపెట్టిన ప్రభాస్ తల్లి..!!

ప్రభాస్ పెళ్లిని అతనే చెడగొడుతున్నారా.. అసలు నిజం బయటపెట్టిన ప్రభాస్ తల్లి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టార్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మన బాహుబలి మాత్రమే. ప్రభాస్ కు ఉండే యూత్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాటల్లో చెప్పలేం. పాన్ ఇండియా హీరోగా దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ప్రభాస్ అంటే పడి చచ్చిపోతారు అనుకోండి. అలాంటి ఈ స్టార్ హీరో పెళ్లి గురించి ఈ మధ్య కాలంలో అనేక వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని, ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అని రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

ALSO READ:ఉద‌యం అన్నం సాయంత్రం.. రాత్రి అన్నం ఉద‌యం తింటున్నారా..? అయితే ప్ప‌కుండా ఈ విష‌యాలు తెలుసుకోండి..!

Advertisement

మరి ఇంత జరిగినా 40 ఏళ్ళు దాటిన ఈ ప్రభాస్ వివాహం విషయంలో కనీసం వివరణ కూడా ఎందుకు ఇవ్వడం లేదో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ తాజాగా అతను పెళ్లి విషయంపై ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ప్రభాస్ తల్లి శివకుమారి ఏమన్నది అంటే ఆ వ్యక్తి వల్లే తన కొడుకు పెళ్లి చేసుకోవడం లేదని సన్నిహితుల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. మరి ఆ వ్యక్తి ఎవరు అంటే ప్రభాస్ కి బెస్ట్ ఫ్రెండు రవి అనే వ్యక్తి ఉండేవారు. అతడితో కలిసి చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. హీరోగా ఎంత బిజీగా ఉన్నా ఏ మాత్రం టైం దొరికినా రవితో కలిసి టైం స్పెండ్ చేయడం ప్రభాస్ కు చాలా ఇష్టమని, అయితే రవి అనే ఈ ఫ్రెండు ఒక అమ్మాయిని ప్రేమించడం, ప్రేమలో దారుణంగా విఫలమవడం జరిగిందట.

ఇక అప్పటినుంచి రవి తన లవ్ స్టోరీ, లవ్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఎప్పుడూ కూడా ప్రభాస్ తో చర్చిస్తూ ఉండేవారట. దీంతో ప్రభాస్ కి పెళ్లి, ప్రేమపై ఒక రకమైన అభిప్రాయం ఏర్పడిందని, అందుకే ప్రభాస్ పెళ్లి చేసుకోమ్మని అడిగితే వద్దని నిరాకరిస్తున్నారని తల్లి శివ కుమారి తన సన్నిహితులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధమెంతో తెలియదు కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం ఆయన పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నది నిజం.

ALSO READ:నాగ‌బాబు కూతురు నీహారిక పెళ్లికి క‌ట్నం ఎంత ఇచ్చాడో తెలుసా..?

 

Visitors Are Also Reading