Home » సుడిగాలి సుధీర్‌ కెరీర్ నాశనంకు ‘అన్నయ్య’ కారణమా ?

సుడిగాలి సుధీర్‌ కెరీర్ నాశనంకు ‘అన్నయ్య’ కారణమా ?

by Anji
Ad

ఈటీవీ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సుడిగాలి సుధీర్ సూపర్ స్టార్ రేంజ్ ని దక్కించుకున్న విషయం తెలిసిందే. బుల్లితెర సూపర్ స్టార్ అంటూ సుడిగాలి సుధీర్ ని ఆయన అభిమానులు ముద్దుగా పిలుచుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బుల్లితెరపై సుధీర్ కనిపించడంలేదు. వెండితెరపై ఆయన చేసిన సినిమాలు ఆకట్టుకోవడం లేదు. ఈ సమయంలో బుల్లితెరపై మళ్లీ సుదీర్ కనిపిస్తే చూడాలని కోరుకుంటున్నాం అంటూ ఆయన అభిమానులు ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలను హాయిగా చేసుకుంటున్న సుడిగాలి సుదీర్ ని ఎవరు స్టార్ మా లోకి లాగారు అనే విషయంపై అర్థం అవడం లేదు.

Advertisement

లేనిపోని హామీలను కల్పించి ఊహలను ఆయనకు చెప్పి రెచ్చగొట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని మానిపించడంతో పాటు జబర్దస్త్ నుండి కూడా బయటకు వచ్చేలా చేశారు. అది ఎవరు అంటే.. ఎక్కువ శాతం మంది ఓంకార్ అన్నయ్య అనే పేరును చెబుతున్నారు. గతంలో కామెడీ స్టార్ కార్యక్రమాన్ని స్టార్ మా కోసం ఓంకార్ నిర్వహించాడు. ఆ కార్యక్రమం కోసమే సుడిగాలి సుదీర్ తో పాటు మరికొందరు జబర్దస్త్ కమెడియన్స్ ని ఓంకార్ తన ప్రొడక్షన్ హౌస్ లోకి ఆకర్షించే ప్రయత్నం చేశాడు. ఎక్కువ పారితోషికం ఇవ్వడంతో పాటు ఇతరత్రా కారణాల వల్ల చాలా మంది కమెడియన్స్ అటు వైపు ఆకర్షితులయ్యారు. తీరా టు వెళ్లిన తర్వాత కామెడీ స్టార్స్ కార్యక్రమంలో ఎత్తేశారు. ఏ మాత్రం అవకాశాలు లేకుండా వారిని అనాధలుగా మార్చేశారంటూ బుల్లితెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

Advertisement

Also Read :  చంద్ర‌బాబు లైఫ్‌లో బిగ్ అల‌య‌న్స్ ఏంటో తెలుసా..?

సుడిగాలి సుదీర్ చాలాకాలం ఖాళీగా ఉన్న తర్వాత ఎట్టకేలకు ఆహా ఓటీటీ ప్రసారం కాబోతున్న ఒక కామెడీ షో కోసం రెడీ అవుతున్నాడు. కామెడీ షో వర్కౌట్ అయితే పర్వాలేదు.. లేదంటే మరో రెండు మూడు నెలల తర్వాత సుడిగాలి సుదీర్ మళ్లీ అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి.. అలా సుడిగాలి సుధీర్ కెరియర్ ను నాశనం చేశారంటూ ఆయన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి సుధీర్ కెరియర్ ను నాశనం చేశారంటూ ఓంకార్ ని విమర్శిస్తున్న సమయంలో కొందరు విమర్శలను కొట్టి పారేస్తున్నారు.హీరో గా అవకాశాలు వస్తున్నాయని ఉద్దేశంతో సుడిగాలి సుదీర్ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేశాడు. అంతేకానీ మరేదో కారణం కాదంటూ బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Also Read :  కుర్ర‌హీరోల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించిన హ‌రికృష్ణ సినిమా ఏదో తెలుసా..? ఆ సినిమా రికార్డులు ఇవే..?

Visitors Are Also Reading