బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనుంది. ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ శేఖరేను ఐరా ఖాన్ పెళ్లి చేసుకోనుంది. జనవరి 3న అంగరంగ వైభవంగా వీరు వివాహం జరగనుంది. ఇప్పటికే వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలను ఐరా ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. అమీర్ ఖాన్ మరియు రీనా దత్తా 1986లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కూతురు ఐరా ఖాన్. అమీర్ ఖాన్, రీనా దత్తా 2002లో విడాకులు తీసుకున్నారు.
Advertisement
అయినప్పటికీ అమీర్ ఖాన్ తన పిల్లలతో, మాజీ భార్యతో టచ్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా చేస్తున్నాడు అమీర్ ఖాన్. నటుడు అమీర్ ఖాన్ కు పిట్ నెట్ శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన నుపుర్ శిఖరతో ఐరా ఖాన్ ప్రేమలో పడింది. కొంతకాలంగా డేటింగ్ చేసిన ఈ జంట ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కనుంది. జనవరి 3న జరుగనున్న వివాహ వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. తన కూతురి పెళ్లి నిమిత్తం సినిమా షూటింగ్ కు విరామం ఇచ్చాడు అమీర్ ఖాన్.
View this post on InstagramAdvertisement
సెలబ్రిటీల పిల్లలు కూడా సినిమా రంగంలోకి వస్తుంటారు. అయితే అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ మాత్రం సినిమా రంగంపై ఆసక్తి చూపడం లేదు. ఇతర స్టార్ కిడ్స్ లాగా నటి కావాలనే ఆసక్తి ఆమెకు లేదు. సోషల్ మీడియాలో ఎన్నో ఆలోచనలు పంచుకుంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది ఈ చిన్నది. రకరకాల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఐరా. ఇక ఈ అమ్మడి పెళ్లి ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.