Home » IPL స‌క్సెస్, మ‌రి పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ ఎందుకు ఫెయిల్ అయ్యింది?

IPL స‌క్సెస్, మ‌రి పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ ఎందుకు ఫెయిల్ అయ్యింది?

by Azhar
Ad

2008లో ఇండియాలో ప్రారంభ‌మైన IPL సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. దీన్ని చూసి పాక్ క్రికెట్ బోర్డ్ కూడా PSL (పాకిస్తాన్ సూప‌ర్ లీగ్) అనే కాన్సెప్ట్ ను తీసుకొచ్చింది. కానీ IPL తో పోల్చితే PSL క‌నీసం 30 శాతం కూడా స‌క్సెస్ కాలేక‌పోయింది దీనికి గ‌ల కార‌ణాలు చూద్దాం!

Advertisement

1. డ‌బ్బు:
BCCI ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నిక క్రికెట్ బోర్డు. గేమ్ అంతా దానికి త‌గ్గ‌ట్టుగానే ఉంటుంది. భారీ ప్రైజ్ మ‌నీ, పెద్ద పెద్ద ఫ్రాంచైజీలు, కోట్ల‌లో ఆట‌గాళ్ల రేట్లు. IPL మ‌నీ ఫ్లోటింగ్ తో పోల్చితే PSLలో ఖ‌ర్చు అయ్యేది 40 శాత‌మే!

2.ప్రేక్ష‌కులు
IPL మ్యాచులకు జ‌నాలు స్టేడియాలు నిండుతారు. కానీ PSLలో ఆ ప‌రిస్థితి లేదు.

Advertisement

3. ఇంట‌ర్నేష‌న‌ల్ షెడ్యూల్:
IPL మ్యాచులు జ‌రిగేట‌ప్పుడు ICC ఇత‌ర టోర్న‌మెంట్లను ప్లాన్ చేయ‌డం లేదు కాబ‌ట్టి ఆట‌గాళ్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా IPL లో ఆడుతున్నారు.

4. బెస్ట్ కోచ్ లు:
IPL టీమ్ ల ప్రాంచైజీలు ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డం చేత ప్ర‌పంచంలోని దిబెస్ట్ కోచ్ ల‌ను రంగంలోకి దించుతాయి. PSLలో ఆ ప‌రిస్థితి లేదు….అక్క‌డి మాజీ ప్లేయ‌ర్స్ యే కోచ్ లుగా ఉంటున్నారు.

5. భ‌ద్ర‌త :
పాక్ తో పోల్చితే ఇండియాలో ఆట‌గాళ్లకు భ‌ద్ర‌త ఎక్కువ‌, క్రేజ్ కూడా ఎక్కువ కాబ‌ట్టి విదేశీ ఆట‌గాళ్లు IPL లో ఆడ‌డానికి ఇంట్ర‌స్ట్ చూపుతుంటారు.

Visitors Are Also Reading