మొదటిసారిగా ఇండియా బయట ఐపీఎల్ వేలం జరిగింది. దుబాయ్ 2024లో ఐపీఎల్ కు సంబంధించిన మినీవేలం ఘనంగా జరిగింది. ఈ వేలంలో ఆటగాళ్ల మీద కోట్ల వర్షం కురిసింది. ఇక వేలంలో ఎక్కువ ధర పలికిన టాప్ ఫైవ్ ఆటగాళ్లలో విదేశీ ప్లేయర్స్ నలుగురు ఉండటం విశేషం. అందులో ఆశిష్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ కొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికాడు. అతని కోసం అన్ని జట్లు పోటీపడ్డాయి. ఇక కోల్కత్తా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ అయితే చివరివరకు పోటీపడ్డాయి. దాంతో అతను 24.75 కోట్ల భారీ ధర పలికాడు. అతడిని కోల్కత్తా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.
ఇక రెండవ హైయెస్ట్ ధరను ప్యాట్ కమీన్స్ దక్కించుకున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అతని కోసం భారీ ధర పెట్టింది. 20.50 కోట్ల ధర పలకడం విశేషం. కమిన్స్ కోసం అన్ని జట్లు పోటీపడ్డాయి. ధర పెంచుకుంటూ పోయాయి. కానీ సన్రైజర్స్ హైదరాబాద్ మాత్రం అతని వదలలేదు. దాంతో ఇతను ఈ సీజన్లోనే కాకుండా ఐపీఎల్ చరిత్రలోనే రెండవ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ఈ సీజన్ మూడవ హైయెస్ట్ ప్లేయర్ గా డారిల్ మిచెల్ నిలిచాడు. వన్డే వరల్డ్ కప్ లో ఈ స్టార్ ప్లేయర్ భారీ సెంచరీలు చేశాడు.
Advertisement
దాంతో అతని కోసం ఎక్కువ జట్లు పోటీపడగా…. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ అతడిని 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇక నాలుగో ప్లేయర్ గా ఇండియన్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ నిలిచాడు. గతంలో ఆర్సిబి తరపున మంచి ప్రదర్శన ఇచ్చాడు. దాంతో వేలంలో ఇతని కోసం భారీ పోటీ జరిగింది. కానీ పంజాబ్ కింగ్స్ మాత్రం చివరి వరకు పోరాడి అతన్ని 11.75 కోట్లకు తీసుకుంది. ఇక అయిదవ అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో బెస్ట్ ఆటగాడు అల్జరీ జోసెఫ్ నిలిచాడు. ఇతని కోసం ఆర్సిబి పోటీపడి మరి కొనుగోలు చేసింది. జట్టులో పేస్ బౌలర్లు తక్కువగా ఉండడంతో ఈ స్టార్ ఆటగాడి కోసం 11.5 కోట్లు పెట్టింది. మరి ఈ ప్లేయర్స్ లో వారికి ఎవరు మంచి ప్రదర్శన ఇస్తారో చూడాలి.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.