Home » IPL 2022 : ఐపీఎల్ ఫ్యాన్స్‌కు శుభ‌వార్త‌.. షెడ్యూల్ వ‌చ్చేసింది..!

IPL 2022 : ఐపీఎల్ ఫ్యాన్స్‌కు శుభ‌వార్త‌.. షెడ్యూల్ వ‌చ్చేసింది..!

by Anji
Ad

క్రికెట్ అభిమానుల‌కు అదిరిపోయే శుభ‌వార్త చెప్పింది బీసీసీఐ. కాసేప‌టి క్రిత‌మే ఐపీఎల్ 2022 టోర్ని పూర్తి షెడ్యూల్ విడుద‌ల అయింది. ఐపీఎల్ 2022 షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది బీసీసీఐ పాల‌క మండ‌లి. ఫిబ్ర‌వ‌రి 25న జ‌రిగిన ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ స‌మావేశంలో లీగ్ షెడ్యూల్ బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇవాళ ఐపీఎల్ 2022 టోర్నీ పూర్తి షెడ్యూల్ విడుద‌లైంది.

Advertisement

మార్చి 26న ప్రారంభ‌మయ్యే ఐపీఎల్ 2022 సీజ‌న్ 15 మే 29 న ఫైన‌ల్ తో ముగియ‌నుంది. డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్‌కింగ్స్‌, ర‌న్న‌ర‌ప్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య మార్చి 26న వాంఖ‌డే స్టేడియంలో తొలి మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ది. ఈ సారి రెండు గ్రూపులుగా విడిపోయి ఒక్కోజ‌ట్టు 14 మ్యాచ్‌ల‌ను ఆడాలి. దీంతో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జ‌రుగుతాయి. ఇవే కాకుండా ఫైన‌ల్‌తో క‌లిపి నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లుంటాయి.

Advertisement

Visitors Are Also Reading