Home » ఐపీఎల్​లో ‘మెయిడెన్ మాస్టర్స్​​’ వీళ్లే..!

ఐపీఎల్​లో ‘మెయిడెన్ మాస్టర్స్​​’ వీళ్లే..!

by Anji
Published: Last Updated on
Ad

ఐపీఎల్ అంటేనే దుమ్ము రేపే బ్యాటింగ్.. ఊహ‌కు అంద‌ని క్యాచ్‌లు వావ్ అనిపించే యార్క‌ర్లు.. ఒక్క‌టేమిటి ప్ర‌తి క్ష‌ణం ఏమ‌వుతుందా అని క్రికెట్ అభిమానుల్లో ఒక్క‌టే ఉత్కంఠ‌. ఈ మెగా టోర్నీలో బ్యాట‌ర్ల‌తో పాటు బౌల‌ర్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. వారిని త‌క్కువ ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసి రికార్డులు సృష్టిస్తున్నారు. కొద్ది రోజుల్లో ఈ సీజ‌న్ ప్రారంభం కానున్న‌ది. ఈ త‌రుణంలో ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక మెయిడెన్ ఓవ‌ర్లు వేసిన బౌల‌ర్లు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ప్ర‌వీణ్ కుమార్

 

 

 

 

 

 

 

 

 

భార‌త మాజీ స్వింగ్ బౌల‌ర్ ప్ర‌వీణ్ కుమార్ ఈ లిప్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధికంగా 14 మెయిడెన్ ఓవ‌ర్లు వేశాడు. 119 మ్యాచ్ లు ఆడిన 90 వికెట్లు తీశాడు. ఈ మెగా టోర్నీలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు.

Advertisement

ఇర్పాన్ ప‌ఠాన్

ఐపీఎల్ లో వివిధ ప్రాంచైజీల తరఫున ఆడాడు. ఇప్పటివరకు 103 మ్యాచులు ఆడిన ఇర్ఫాన్ 80 వికెట్లను ద‌క్కించుకున్నాడు. మొత్తానికి తన కెరీర్ లో అత్యధికంగా 10 మెయిడెన్‌ ఓవర్లు వేసి రెండో స్థానంలో నిలిచాడు ఇర్ఫాన్.

భువ‌నేశ్వ‌ర్ కుమార్

టీమిండియా సీనియ‌ర్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఇప్ప‌టి వ‌ర‌కు 132 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. తొమ్మిది మెయిడెన్ ఓవ‌ర్లు వేసి మూడ‌వ స్థానంలో నిలిచాడు. ఈ స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాడు ఐపీఎల్ బౌలింగ్ ఎకాన‌మీలోనూ టాప్‌లో ఉన్నాడు.

Also Read : IPL 2022 : ఐపీఎల్ నిబంధ‌న‌ల్లో కీల‌క మార్పులు..!

Visitors Are Also Reading