Home » IPL 2022 : త‌క్కువ బంతుల్లో అర్థ‌శ‌తకాలు సాధించిన విధ్వంస వీరులు వీరే..!

IPL 2022 : త‌క్కువ బంతుల్లో అర్థ‌శ‌తకాలు సాధించిన విధ్వంస వీరులు వీరే..!

by Anji
Ad

ఐపీఎల్ అంటేనే అభిమానులు ఆశించేది ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌. క్రీజులో ఉన్న‌ది యువ‌కుడా లేక అనుభ‌వ‌జ్ఞుడా అనేది చూడ‌రు. బంతిని బౌండ‌రీ దాటించాడా లేదా.. సిక్స‌ర్ల మోత మోగించాడా లేదా వికెట్ తీశాడా అనేది లెక్కెసుకుంటారు. వీలు అయిన‌న్నీ త‌క్కువ బంతుల్లో ఎక్కువ ప‌రుగులు సాధించిన వారే హీరోలుగా మిగులుతారు. మ‌రికొద్ది రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు అతిత‌క్కువ బంతుల్లో అత్య‌ధిక ప‌రుగులు, అందులోనూ అర్థ‌శ‌త‌క రికార్డులు నెల‌కొల్పిన టాప్ బ్యాట‌ర్లు ఎవ‌రో తెలుసుకుందాం.

Advertisement

కే.ఎల్‌.రాహుల్


ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్యంత వేగంగా అర్థ‌శ‌త‌కం సాధించిన ఆట‌గాళ్ల జాబితాలో కే.ఎల్‌.రాహుల్ అంద‌రిక‌న్నా ముందున్నాడు. అత‌డు 14 బంతుల్లోనే సెంచ‌రీ పూర్తి చేసి నాలుగేళ్లుగా నెంబ‌ర్ వ‌న్ స్థానంలో కొన‌సాగుతున్నాడు. 2018లో పంజాబ్ జ‌ట్టు త‌రుపున ఆడిన అత‌డు ఢిల్లీలో త‌ల‌ప‌డిన మ్యాచ్‌లో ఈ ఘ‌న‌త సాధించాడు. ఆ మ్యాచ్‌లో మొత్తం 16 బంతులు ఎదుర్కున్న రాహుల్‌.. 6 ఫోర్లు 4 సిక్స‌ర్ల సాయం 51 ప‌రుగులు సాధించాడు.

యూసుఫ్‌ పఠాన్‌

ఇత‌ను కూడా మెరుపులు మెరిపించాడు. ఈ జాబితాలో రెండ‌వ స్థానం కైవ‌సం చేసుకున్నాడు. 2014లో అత‌డు కోల్‌క‌తా త‌రుపున ఆడ‌గా స‌న్‌రైజ‌ర్స్‌తో త‌ల‌ప‌డిన ఓ మ్యాచ్‌లో 15 బంతుల్లోనే అర్థ‌శ‌తకం సాధించాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా అర్థ‌శ‌త‌కం సాధించాడు. రాహుల్ 2018లో ఈ రికార్డును క్రాస్ చేసేంత వ‌ర‌కు యూసూప్ తొలి స్థానంలోనే ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో అత‌డు 22 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స‌ర్ల సాయంతో మొత్తం 72 ప‌రుగులు సాధించాడు.

సునీల్‌ నరైన్‌

ఈ ఆల్ రౌండ‌ర్ సునీల్ న‌రైన్ కూడా దంచికొట్టాడు. యూసుఫ్ మాదిరిగానే 15 బంతుల్లో అర్ద‌శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు. 2017 లో బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డు రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. అందులో మొత్తం 17 బంతులు ఎదుర్కొని.. 6 ఫోర్లు, 4 సిక్స‌ర్ల సాయంతో మొత్తం 54 ప‌రుగులు సాధించాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా అర్థ‌శ‌త‌కం పూర్తి చేసిన ఆట‌గాళ్ల జాబితాలో మూడ‌వ స్థానంలో నిలిచాడు.

Advertisement

సురేష్ రైనా 

ఐపీఎల్ సురేష్ రైనా చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు త‌రుపున కొన్ని కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడాడు. ముఖ్యంగా 2014లో చెన్నై త‌రుపున పంజాబ్ తో ఆడిన ఓ మ్యాచ్‌లో 16 బంతుల్లోనే హాఫ్ సెంచ‌ర పూర్తి చేశాడు. దీంతో ఈ జాబితా నాలుగ‌వ స్థానంలో నిలిచిన ఆట‌గాడిగా ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో మొత్తం 25 బంతులు ఎదుర్కొన్న రైనా.. 12 ఫోర్లు, 6 సిక్స‌ర్ల సాయంతో మొత్తం 87 ప‌రుగులు చేశాడు. అంటే ఈ జాబితాలో త‌క్కువ బంతుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగానూ ఈ చెన్నై మాజీ ప్లేయ‌ర్ రికార్డు నెల‌కొల్పాడు. ఈ సారి ఐపీఎల్‌లో మాత్రం సురేష్ రైనాను ఏ జ‌ట్టు కొనుగోలు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇషాన్ కిష‌న్

ఈ మ‌ధ్య కాలంలో ఇషాన్ కిష‌న్ వీర‌బాదుడు బాదుతుండు. ఈ జాబితాలో ఐద‌వ స్థానంలో నిలిచాడు ముంబ‌యి బ్యాట్స్‌మ‌న్‌. గ‌త ఏడాది స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లో అర్థ శ‌త‌కం సాధించి రైనా త‌రువాత స్థానాన్ని కైవ‌సం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 32 బంతులు ఆడిన ఇషాన్‌, 11 పోర్లు, 4 సిక్స‌ర్ల‌తో మొత్తం 84 ప‌రుగులు చేశాడు. దీంతో త‌క్కువ బంతుల్లో అర్థ‌శ‌త‌కం సాధించిన వారిలో ఐద‌వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇలా దంచికొట్ట‌డం వ‌ల్లే ముంబ‌యి ఈసారి అయితే వేలంలో రూ.15.25 కోట్ల అత్య‌ధిక ధ‌ర వెచ్చించి మ‌రీ కొనుగోలు చేసింది.

17 బంతుల్లో అర్థ‌శ‌త‌కం సాధించిన ఆట‌గాళ్లు

ఇషాన్ కిష‌న్ తో పాటు 17 బంతుల్లో అర్థ‌శ‌త‌కం సాధించిన ఆట‌గాళ్ల జాబితాలో మొత్తం 9 మంది బ్యాట్స్‌మెన్‌లున్నారు. క్రిస్‌గేల్‌, హార్దిక్ పాండ్య‌, కీర‌ణ్ పొలార్డ్‌, ఆడం గిల్‌క్రిస్ట్‌, క్రిస్ మోరిస్‌, నికోల‌స్ పూర‌న్‌తో పాటు, ఇషాన్‌, పోలార్డ్‌, న‌రైన్ రెండ‌వ‌సారి ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. 18 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ చేసిన వారిలో రిష‌బ్‌పంత్‌, పృథ్వీషా, బ‌ట్ల‌ర్ ఉన్నారు.

Also Read :  Today rasi phalalu in telugu : ఆ రాశి వారు శ‌త్రువుల‌పై విజ‌యం సాధిస్తారు

Visitors Are Also Reading