Home » సినిమాలో సూపర్ స్టార్స్ లేరు..! నాలుగు రోజులు ఆడితే చాలనుకున్నారు 12 లక్షలు పెడితే ఎంత కలెక్షన్స్ రాబట్టిందంటే..?

సినిమాలో సూపర్ స్టార్స్ లేరు..! నాలుగు రోజులు ఆడితే చాలనుకున్నారు 12 లక్షలు పెడితే ఎంత కలెక్షన్స్ రాబట్టిందంటే..?

by AJAY
Ad

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ద‌ర్శ‌కుడు బాబుగారికి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. ఆయ‌న‌తో ఒక్క‌సినిమా చేసినా చాల‌ని అప్ప‌టి స్టార్ హీరోలు హీరోయిన్ లు అనుకునేవారు. ఇక పోతే బాపూ తీసిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌లో ముత్యాల ముగ్గు కూడా ఒక‌టి. ఈ సినిమాలో స్టార్ హీరోలు ఎవ‌రూ లేకుండా వ‌ర్త‌మాన న‌టీన‌టుల‌తో తెర‌కెక్కించారు. ఈ సినిమాకు అప్ప‌ట్లో 12 ల‌క్ష‌ల‌కు పైగా ఖ‌ర్చు చేసి నిర్మించారు.

Advertisement

ఉత్త‌ర‌రామాయ‌ణంను సాంఘీక‌రించి ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇక ఈ సినిమాకు అప్పుడే రూ.2కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో శ్రీద‌ర్ హీరోగా న‌టించ‌గా సంగీత హీరోయిన్ గా న‌టించారు. అంతే కాకుండా అప్ప‌టికి పెద్ద‌గా గుర్తింపు లేని రావుగోపాల్ రావును విల‌న్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో నేరాలు చేసే కాంట్రాక్ట‌ర్ గా రావుగోపాల్ రావు అద్బుతంగా న‌టించారు.

Advertisement

ఈ సినిమాలో న‌టీన‌టుల‌కు మేక‌ప్ లేకుండానే తెర‌కెక్కించ‌డం అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా న‌టీన‌టుల‌కు మేక‌ప్ లేద‌ని తెలియ‌డంతో సినిమాను కొనేందుకు కూడా ఎవ‌రూ ముందుకు రాలేదు. ఈ సినిమా పూర్త‌యి మొద‌టి కాపీ రాగేనే ఎన్టీరామారావుకు చూపించారు. సినిమా చూసిన ఎన్టీఆర్ మా రోజులు గుర్తుచేశావ్ బ్రద‌ర్ అంటూ బాపూను అభినందించార‌ట‌.

 

అయిన‌ప్ప‌టికి సినిమాపై అంచ‌నాలు లేక‌పోవ‌డంతో త‌క్కువ సంఖ్య‌లో థియేట‌ర్ ల‌లో విడుద‌ల చేశారు. అవి కూడా పాత థియేట‌ర్ ల‌లోనే సినిమాను వేసుకున్నారు. మ‌హా అయితే ఈ సినిమా నాలుగు రోజులు ఆడుతుందేమో అనే భావ‌న‌లో చిత్ర యూనిట్ ఉంది. సినిమాకు ప‌బ్లిసిటీ కూడా చేయ‌లేదు. కానీ ఈ సినిమాకు వ‌స్తున్న టాక్ చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. ఫస్ట్ వీక్ నుండి క‌లెక్ష‌న్ ల జోరుపెరిగింది. ప్రేక్ష‌కుల‌కు తెగ న‌చ్చ‌డంతో కోట్ల‌ల్లో వ‌సూలు చేసింది.

Visitors Are Also Reading