Home » “అయోధ్య రామయ్య” గా మొదలైన బాలయ్య సినిమా”నరసింహనాయుడు” గా ఎలా మారిందో తెలుసా..!

“అయోధ్య రామయ్య” గా మొదలైన బాలయ్య సినిమా”నరసింహనాయుడు” గా ఎలా మారిందో తెలుసా..!

by AJAY
Ad

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన నరసింహనాయుడు సినిమా 2001లో విడుదలైంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నప్పటికీ ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే ప్రత్యేకం అని చెప్పాలి. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ కథను అందించగా…. పరుచూరి బ్రదర్స్ మాటలు రాశారు.

Advertisement

అప్పట్లో రికార్డులు సృష్టించిన ఈ సినిమాకు పాతిక కోట్లకు పైగా కలెక్షన్లు రావడం గొప్ప విషయం. అయితే ఈ సినిమా తెరకెక్కక ముందు తెర వెనక చాలా కథ జరిగింది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…. బాలయ్య బి.గోపాల్ కాంబినేషన్ లో అప్పటికే రెండు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. దాంతో ఈ సినిమా వారి కాంబినేషన్ లో మూడో సినిమాగా తెరకెక్కింది. అయితే నిజానికి ఈ సినిమా కంటే ముందు బి.గోపాల్ పోసాని కృష్ణ మురళి అందించిన కథతో అయోధ్య రామయ్య అనే సినిమాను అనుకున్నారు.

Advertisement

ఈ సినిమాకు ముహూర్తపు షాట్ ను కూడా తీశారు. హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో సినిమా షూటింగ్ ను ప్రారంభించగా… అక్కడకు బాలయ్య అభిమానులు భారీగా చేరుకున్నారు. అంతేకాకుండా రెండు బ్లాక్ బస్టర్ లు తీయడంతో మూడో సినిమా కచ్చితంగా హిట్ ఇవ్వాలని అభిమానులు పదే పదే గుర్తు చేశారు. దాంతో బి.గోపాల్ మళ్ళీ ఆలోచనలో పడ్డారు. వెంటనే రచయిత చిన్నికృష్ణ కు ఫోన్ చేసి కథ కావాలని అడిగారు.

narasimhanayudu

narasimhanayudu

రచయిత చిన్నికృష్ణ బీహార్ లో జరిగిన నిజ సంఘటన ఆధారంగా తయారు చేసిన కథను బి.గోపాల్ కు వినిపించారు. బి.గోపాల్ చిన్నికృష్ణ కలిసి అదే కథను పరుచూరి బ్రదర్స్ కు సైతం వినిపించారు. ఇక ఆ కథకు ఇంప్రెస్స్ అవ్వడంతో కొన్ని మార్పులు చేర్పులు చేసి నరసింహ నాయుడు సినిమాను తెరకెక్కించారు. అంతే కాకుండా అయోధ్య రామయ్య సినిమా ను పక్కన పెట్టేశారు. ఇక ఇప్పటికీ నరసింహ నాయుడు సినిమా టివి లో వస్తే బాలయ్య బాబు అభిమానులు మిస్ కాకుండా చూస్తారు.

Visitors Are Also Reading