Home » ‘ఇడియట్’ కన్నడ వర్షన్ ‘అప్పు’ సినిమా కోసం పూరి జగన్నాధ్ కి పునీత్ రాజ్ కుమార్ పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా ?

‘ఇడియట్’ కన్నడ వర్షన్ ‘అప్పు’ సినిమా కోసం పూరి జగన్నాధ్ కి పునీత్ రాజ్ కుమార్ పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా ?

by AJAY
Ad

పూరిజ‌గ‌న్నాత్ కెరీర్ లో ఫ్లాప్ అయిన సినిమాల్లో బాచి సినిమా కూడా ఒక‌టి. అయితే ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అయ్యింది క‌న్న‌డ నాట మంచి విజ‌యం సాధించింది. దాంతో ఈ సినిమా చూసిన క‌న్న‌డ స్టార్ రాజ్ కుమార్ పూరీజ‌గ‌న్నాత్ ను ఇంటికి పిలిచి అభినందించారు. అంతే కాకుండా రాజ్ కుమార్ పెద్ద కుమారుడు యువ‌రాజ తో యువ‌రాజ సినిమా చేసే అవ‌కాశం పూరికి దక్కింది. ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధించింది.

Advertisement

ఇక రాజ్ కుమార్ మూడో కుమారుడు పునీత్ రాజ్ కుమార్ ను లాంఛ్ చేసే బాధ్య‌త‌ను కూడా రాజ్ కుమార్ పూరి చేతిలో పెట్టారు. దాంతో క‌థ చెప్ప‌డానికి పూరీ బెంగుళూరుకు వెళ్లాడు. అయితే పునీత్ రాజ్ కుమార్ తండ్రి రాజ్ కుమార్ పూరి జ‌గ‌న్నాత్ కు ఓ కండిష‌న్ పెట్టాడు. సాధార‌ణంగా సినిమా క‌థ‌ను నిర్మాత‌లు క‌లిసి వింటారు. లేదంటే ఒక్క‌రు లేదా ఇద్ద‌రు వింటారు. కానీ రాజ్ కుమార్ ఆడిటోరియంలో కుటుంబం మొత్తాన్ని కూర్చోబెట్టాడు.

Advertisement

అంతే కాకుండా అక్క‌డే పనివాళ్లు కూడా ఉన్నారు. వాళ్లంద‌రినీ చూసి పూరీ షాక్ అయ్యాడు. వీళ్లంద‌రూ ఎందుక‌ని అడిగాడు. దాంతో రాజ్ కుమార్ మా పునీత్ మొద‌టి సినిమా క‌థ మా అంద‌రికీ న‌చ్చాలి. ఒక్క‌రికి న‌చ్చ‌క‌పోయినా సినిమా క్యాన్సిల్ అని చెప్పేశాడు. కానీ పూరీ కాన్ఫిడెంట్ గా క‌థ‌ను షురూ చేశాడు. ముందు క‌మిష‌న‌ర్ కూతురును స్టూడెంట్ ప్రేమించ‌డం అంటూ ఇడియ‌ట్ సినిమా క‌థ‌ను వివ‌రించాడు.

కుటుంబం మొత్తం క‌లిసి ఆ క‌థ‌ను విన్నారు. క‌థ విన్న త‌ర‌వాత‌ రాజ్ కుమార్ కు తెగ‌న‌చ్చేసింది. దాంతో వెంట‌నే పునీత్ ను మీరే లాంఛ్ చేయాల‌ని పూరీకి చెప్పాడు. ఇక అప్ప‌టికే ర‌వితేజ హీరోగా ఇడియ‌ట్ సినిమా అనుకున్నాడు. కానీ పునీత్ తో అప్పు పూర్తి చేసిన త‌ర‌వాత‌నే ఇడియ‌ట్ ను ప‌ట్టాలెక్కించాడు. అక్క‌డ అప్పు సూప‌ర్ హిట్ కాగా ఇక్క‌డ ఇడియ‌ట్ కూడా సూప‌ర్ హిట్ అయ్యింది.

ALSO READ : అలనాటి స్టార్ హీరోయిన్ రజిని.. ఇలా మారిందేంటి..?

Visitors Are Also Reading