కరోనా మహమ్మారి విజృంభణ తరవాత అనారోగ్యం భారినపడి మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఎక్కువ మంది మరణిస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటూ సినిరాజకీయ ప్రముఖులు సైతం మహమ్మారి భారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక రీసెంట్ గా హీరోయిన్ మీన భర్త కూడా అనారోగ్యం భారిన పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. మీనా భర్త విద్యాసాగర్ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ కన్నుమూశారు.
Advertisement
అయితే ఆయన మరణానికి వారి ఇంటి చుట్టు ఉన్న పావురాలు కూడా కారణమనే వార్తలు వినిపించాయి. కానీ ఈ వార్తలపై స్పందించిన మీన మీడియా ఎలాంటి వార్తలను ప్రసారం చేయవద్దని తమకు ప్రైవసీని ఇవ్వాలని కోరారు. కానీ మీన సన్నిహితురాలు ఒకరు విద్యాసాగర్ కరోనా తరవాత ఊపిరితిత్తుల సమస్యతో బాధపడ్డారని చెప్పారు. ఊపిరితిత్తుల కోసం ప్రయత్నించినప్పటికీ డోనర్స్ దొరకలేదని చెప్పారు. ఇక మీన కెరీర్ లో బిజీగా ఉన్న సమయంలోనే విద్యాసాగర్ ను వివాహం చేసుకున్నారు.
Advertisement
మీన భర్తకు సినిమా ఇండస్ట్రీకి అసలు సంబంధమే లేదు. మీన కు తమ తల్లిదండ్రులే పెళ్లి చేశారు. విద్యాసాగర్ విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేసి ఇండియాకు వచ్చారు. అంతే కాకుండా విద్యాసాగర్ బెంగుళూరులో ఓ సాఫ్ట్ వేర్ కంపెనిని స్థాపించారు. తమ తల్లిదండ్రులు సంబంధం చూడకముందే విద్యాసాగర్ తో స్నేహకు ఫ్రెండ్షిప్ ఉండేది. ఇక విద్యాసాగర్ మీన తల్లిదండ్రులు దగ్గరుండి వీరి వివాహాన్ని జరిపించారు.
2009లో మీన విద్యాసాగర్ ల వివాహం తిరుపతిలోని ఆర్యవైశ్యభవన్ లో జరిగింది. ఇక వీరి పెళ్లిని అప్పటి నగరి ఎమ్మెల్యే దురై స్వామి దగ్గరుండి జరిపించారు. దురైస్వామి మీన హీరోయిన్ గా నటించిన సీతరామయ్యగారి మనవరాలు సినిమాను నిర్మించారు. పెళ్లి తరవాత ఫంక్షన్ ను చెన్నై లో ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సిని రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ALSO READ : బింబిసారలో ఎన్టీఆర్ నటిస్తున్నాడా..? క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్‌రామ్..!