Home » హీరోయిన్ సంగీత భ‌ర్త కూడా ఇండ‌స్ట్రీకి చెందిన వ్య‌క్తి అన్న సంగ‌తి తెలుసా..? ఆయ‌న ఎవ‌రంటే..?

హీరోయిన్ సంగీత భ‌ర్త కూడా ఇండ‌స్ట్రీకి చెందిన వ్య‌క్తి అన్న సంగ‌తి తెలుసా..? ఆయ‌న ఎవ‌రంటే..?

by AJAY
Ad

తెలుగులో త‌న అందంతో ఆక‌ట్టుకున్న భామ‌ల్లో హీరోయిన్ సంగీత కూడా ఒక‌రు. నాచుర‌ల్ బ్యూటీగా సంగీత ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఆశ‌ల‌సంద‌డి సినిమాతో సంగీత టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైంది. నిజానికి సంగీత అప్ప‌టికే త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్రాల‌లో న‌టించింది. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు సంగీత పేరు ర‌షిక కానీ ఆమె పేరును మార్చుకుంది. ఖ‌డ్గం సినిమాతో సంగీత‌కు మంచి గుర్తింపు ల‌భించింది.

Advertisement

అమాయ‌క‌మైన అమ్మాయిగా క‌నిపించింది ఆక‌ట్టుకుంది. ఈ సినిమాతో అవార్డుల‌ను సైతం సొంతం చేసుకుంది. ఆ త‌ర‌వాత పెళ్లాం ఊరెళితే సినిమాతోనూ సంగీత‌కు న‌టిగా మంచి గుర్తింపు వ‌చ్చింది. న‌ట‌న అందం ఉన్ప‌టికీ ఈ అమ్మ‌డికి అదృష్టం మాత్రం క‌లిసి రాలేదు. దాంతో ఎక్కువ కాలం స్టార్ హీరోయిన్ గా రానించ‌లేక‌పోయింది. ఇదిలా ఉండ‌గా సంగీత క్రిష్ అనే వ్య‌క్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Advertisement

క్రిష్ కూడా ఇండ‌స్ట్రీకి చెందినవాడే కావ‌డం విశేషం. 2009 లో సింగ‌ర్ క్రిష్ ను సంగీత వివాహం చేసుకుంది. క్రిష్ తమిళ్ లో ఎన్నో సూప‌ర్ హిట్ సాంగ్స్ ను పాడారు. సింగ‌ర్ గా త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ద‌నుష్ సాంగ్స్ లో సూప‌ర్ హిట్ సాంగ్ రౌడీ బేబీ పాట‌ను క్రిష్ పాడారు. ఈ పాట‌కు మిలియ‌న్ల కొద్ది వ్యూవ్స్ వ‌చ్చాయి. ఇక పెళ్లి త‌ర‌వాత‌ వీరిద్ద‌రికీ షివియా అనే పాప కూడా ఉంది.

పెళ్లి త‌ర‌వాత రీఎంట్రీ ఇచ్చిన సంగీత మ‌ళ్లీ తెలుగు త‌మిళ సినిమాల్లో న‌టించింది. అంతే కాకుండా టీవీ షోల తోనూ ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు ద‌గ్గ‌రయ్యింది. మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో స్వ‌రాజ్యం అనే పాత్ర‌లో న‌టించి త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. దాంతో ఆ త‌వార‌త స‌పోర్టింగ్ రోల్స్ కోసం వ‌రుస ఆఫ‌ర్ ల‌ను అందుకుంటోంది.

ALSO READ : భార్య‌లు భ‌ర్త‌ల‌కు అస్స‌లు చెప్ప‌కూడ‌ని విష‌యాలు ఇవేన‌ట‌..! చెబితే ఏం జ‌రుగుతుందంటే..?

Visitors Are Also Reading