Home » చిరంజీవి శ్రీదేవి కాంబోలో వచ్చిన “వజ్రాల దొంగ” సినిమా ఎందుకు షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది..?

చిరంజీవి శ్రీదేవి కాంబోలో వచ్చిన “వజ్రాల దొంగ” సినిమా ఎందుకు షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది..?

by AJAY

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రంలేదు. చిరంజీవిని ఇన్ష్పిరేష‌న్ గా తీసుకుని చాలా మంది యంగ్ హీరోలు ద‌ర్శ‌కులు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టారు. అదే విధంగా హీరోయిన్ల లో దివంగ‌త నటి శ్రీదేవికి సైతం ఓ రేంజ్ లో క్రేజ్ ఉండేది. స్టార్ హీరోలు సైతం శ్రీదేవి డేట్స్ కోసం వేచి చూడాల్సిన ప‌రిస్థితులు ఉండేవి. అంతే కాకుండా శ్రీదేవి సైతం సినిమా చేయాలంటే స్టార్ హీరోల మాదిరిగా కొన్ని డిమాండ్ల‌ను ద‌ర్శ‌క‌నిర్మాత‌ల ముందు ఉంచేది.

ఇక అప్ప‌టి స్టార్ హీరో చిరంజీవి హీరోయిన్ శ్రీదేవిల కాంబినేష‌న్ లో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే అటు చిరంజీవి ఇటు శ్రీదేవి ఇద్ద‌రూ నిర్మాత‌లుగా కూడా మారారు అన్న సంగ‌తి చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. చిరంజీవి ప్రొడ్యూస‌ర్ గా మారి కొన్ని సినిమాల‌ను నిర్మించాడు. కానీ శ్రీదేవి నిర్మాతగా చేయాల్సిన మొదటి సినిమానే ఆగిపోయింది.

అంతే కాకుండా ఈ సినిమాలో హీరో చిరంజీవి కావ‌డం విశేషం. శ్రీదేవి సోద‌రి శ్రీల‌త నిర్మాత‌గా ల‌తా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ ను ప్రారంభించారు. ఈ బ్యాన‌ర్ లో మెగాస్టార్ తో సినిమాను ప్రారంభించారు. ఈ చిత్రానికి కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌కుడు అంతే కాకుండా బ‌ప్పి ల‌హ‌రి మ్యూజిక్ అందించాల్సి ఉంది. ముంబైలో బ‌ప్పి ల‌హ‌రి ఈ సినిమా పాట‌ల‌ను కూడా రికార్డ్ చేశారు. దీనికి సంబంధించిన బాధ్య‌త‌ల‌ను శ్రీదేవి దగ్గ‌రుండి చూసుకున్నారు. ఇక ఈ చిత్రానికి వ‌జ్రాల దొంగ అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నారు. అయితే టైటిల్ ను ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించలేదు. ఈ సినిమా ఎందుకు మ‌ధ్య‌లోనే ఆగిపోయింది అనే విష‌యానికి వ‌స్తే…ఈ సినిమా క‌థ‌ను మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మౌన‌రాగం సినిమాను బేస్ చేసుకుని రాశారు. ఈ సినిమాపై అప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఇక సినిమా షూటింగ్ ప్రారంభించిన త‌ర‌వాత కోదండి రామిరెడ్డికి ఆ అంచ‌నాలు చూస్తే రిజ‌ల్ట్ పై అనుమానం వ‌చ్చింది. ఈ విష‌యాన్ని రామిరెడ్డి శ్రీదేవితో చెప్పారు. దాంతో శ్రీదేవి కొద్ది రోజు లు షూటింగ్ ఆపేసి ప్యాచ్ వ‌ర్క్ చేయాల‌ని చెప్పింది. మ‌రికొంత‌మంది ద‌ర్శ‌కుల‌తో కూర్చుని సినిమాపై ప‌నిచేసినా అది వ‌ర్కౌట్ అవ్వ‌లేదు. చివ‌రికి ఈ సినిమాను మ‌ధ్య‌లోనే ఆపేశారు.

Visitors Are Also Reading