Home » ‘బావగారు బాగున్నారా’ సినిమాకి హీరోగా మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా ? అతను బిజీ గా ఉండటం తో..!

‘బావగారు బాగున్నారా’ సినిమాకి హీరోగా మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా ? అతను బిజీ గా ఉండటం తో..!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. 150కి పైగా సినిమాలలో హీరోగా నటించిన చిరంజీవి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన దర్శకులు…. హీరోలు చాలా మంది చిరంజీవి తమ ఇన్స్పిరేషన్ అని చెబుతుంటారు. అయితే చిరంజీవి ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. చిరంజీవి కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ సినిమాల‌లో ఒకటి బావగారు బాగున్నారా. ఈ సినిమాకు నాగబాబు నిర్మాతగా వ్య‌వ‌హ‌రించారు. నిజానికి నాగబాబును హీరో గా చూడాలని చిరంజీవి అనుకునేవారు.

 

నాగబాబు కూడా తాను హీరో అవ్వాలని కలలు కనేవారు. హీరోగా కొన్ని సినిమాలు చేసిన‌ప్ప‌టికీ నాగబాబు సక్సెస్ అవ్వ‌లేక‌పోయారు. దాంతో చిరంజీవి తన తల్లి అంజనాదేవి పేరుపై అంజన ప్రొడక్షన్స్ నిర్మాణ‌ సంస్థను స్థాపించారు. ఈ నిర్మాణ సంస్థ బాధ్యతలను పూర్తిగా నాగబాబు చూసుకున్నారు. అంతే కాకుండా తన తమ్ముడిని నిలబెట్టేందుకు చిరంజీవి ఎక్కువ డేట్స్ ను అంజనా ప్రొడక్షన్స్ కే ఇచ్చేవారు. ఈ బ్యానర్లో త్రినేత్రుడు, రుద్రవీణ, ముగ్గురు మొనగాళ్లు, బావగారు బాగున్నారా, స్టాలిన్ లాంటి సినిమాలు వచ్చాయి.

Advertisement

Advertisement

అయితే ఈ సినిమాలో బావగారు బాగున్నారా మాత్రమే మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో నాగబాబుకు చాలా లాభాలు కూడా వచ్చాయి. 1998వ సంవత్సరంలో ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించారు. సినిమాలో రంభ హీరోయిన్ గా నటించగా రెండవ హీరోయిన్ గా రచన నటించింది. అంతేకాకుండా మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.

సినిమాలోని ఆంటీ కూతురా, సారీ సారీ సారీ అనే పాటలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. సినిమాలో బ్రహ్మానందం కామెడీ కూడా హైలెట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు హీరోగా దర్శకుడు జయంత్ మొదట చిరంజీవిని అనుకోలేదు. మొదట ఈ సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించారని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఆ టైం లో బిజీగా ఉండటంతో బావగారు బాగున్నారా కు నో చెప్పారు. దాంతో అదే కథను జయంత్ చిరంజీవికి వినిపించి ఒప్పించారు. అలా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Also read: కిర్రాక్ గా ఆర్పీ ల‌గ్జ‌రీ ఇల్లు….హోం థియేట‌ర్ తో పాటూ ఇంటి స్పెషాలిటీలు ఇవే..!

Also Read: శ్రీ‌దేవి త‌ల్లి రాజేశ్వ‌రి సినిమాల్లో న‌టించిన విష‌యం మీకు తెలుసా..? 

Also Read: అల‌ వైకుంఠ‌పుర‌ములో సినిమా న‌టుడి భార్య కూడా మ‌న‌కు తెలిసిన స్టార్ హీరోయిన్…ఎవ‌రంటే..!

Visitors Are Also Reading