Home » అవతార్ సినిమా కథను ఇండియాలో జరిగిన ఆ రియల్ స్టోరీ ఆధారంగా రాసుకున్నారా…?

అవతార్ సినిమా కథను ఇండియాలో జరిగిన ఆ రియల్ స్టోరీ ఆధారంగా రాసుకున్నారా…?

by AJAY
Published: Last Updated on
Ad

జేమ్స్ కెమెరాన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ గా కెమెరాన్ అవతార్ పార్ట్ 2 ను తెర‌కెక్కించారు. అవతార్ ది వే ఆఫ్ వాటర్ అనే పేరుతో కెమెరాన్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. ఈ సినిమా డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఇండియాలో ఇప్పటికే 200 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి.

Also Read:  చిరు రామ్ చ‌ర‌ణ్ పెళ్లిని ఆ స్టార్ హీరో కూతురుతో జ‌రిపించాల‌ని అనుకున్నారా..? కానీ ఏమైందంటే..?

Advertisement

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో పండోరా అనే గ్రహంలో ఓ జాతి తన ఆస్తిత్వం కోసం పోరాటం చేస్తుంది. అయితే అచ్చం ఇలాంటి కథ ఇండియాలోని ఒరిస్సాలో జరిగినట్టు తెలుస్తోంది. ఒరిస్సాలోని రాయగడ జిల్లా సరిహద్దు ప్రాంతంలో నియాంగిరి అనే ఓ పెద్ద అడవి ఉంది. అడవిలో డోంగ్రియా అనే ఆటవిక జాతి నివ‌సిస్తోంది.

Also Read:  బాలయ్య ప‌వ‌న్ ఎపిసోడ్ కోసం ప్లానింగ్ మామూలుగా లేదుగా..?

Advertisement

avatar 2 movie review in telugu

avatar 2 movie review in telugu

అయితే ఆ జాతికి తమ అడ‌వి అంటే మరియు వారి అడవి దేవతలు అంటే ఎంతో నమ్మకం.వంద‌ల‌ సంవత్సరాలుగా వారి జీవన విధానం ఆహారాపు అలవాట్లు బయట ప్రపంచానికి భిన్నంగా ఉన్నాయి. అయితే డోంగ్రియా జాతి ఉంటున్న అడవి ప్రాంతంలో విలువైన బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయి. లక్షల కోట్ల విలువ చేసే ఆ బాక్సైట్ నిక్షేపాలను సొంతం చేసుకోవాలని ఓ ప్రముఖ కంపెనీ భావించింది. ప్రభుత్వంతో సైతం ఆ కంపెనీ ఒప్పందం చేసుకుంది. 2003లో అడవిలో మైనింగ్ కు అనుమతులు వచ్చేలా పావులు కదిపింది.

చివరకు మైనింగ్ చేసుకునేందుకు అనుమతులు కూడా వచ్చాయి. ఇక నియాంగిరి కొండల్లో తవ్వకాలు ప్రారంభించడానికి కంపెనీ సిద్ధమైంది. అయితే అలాంటి సమయంలో ప్రజాసంఘాల స‌పోర్ట్ తో ఆదివాసీల పోరాటం మొదలైంది. రక్తపాతం జరగలేదు కానీ తమ అడవి కోసం డోంగ్రియా జాతి వెనక్కి తగ్గకుండా పోరాటం చేసింది. కోర్టులో న్యాయ పోరాటం చేసినా కోర్టు కూడా కంపెనీకి అనుమ‌తులు ఇస్తూ ప్ర‌జ‌ల‌కు కొన్ని స‌దుపాయాలు క‌ల్పించేలా ఒప్పందం చేసింది. కానీ డోంగ్రియా ప్ర‌జ‌ల‌కు త‌మ అడ‌వి నాశ‌నం అవ్వ‌డం ఇష్టం లేదు. దాంతో మ‌రోసారి పోరాటానికి దిగ‌డంతో ఆ అనుమ‌తులు ర‌ద్దు చేశారు. ఇక అవ‌తార్ లోనూ నేవీలు త‌మ ప్రాంతం కోసం యుద్దం చేసిన సంగ‌తి తెలిసిందే.

Also Read:  15 వారాలు ఇంట్లో ఉన్నా కీర్తికి వచ్చింది అంతేనా…అన్ని లక్షలు మిస్ చేసుకుందిగా…!

Visitors Are Also Reading