Home » అత‌డు సినిమా క‌థ‌ను త్రివిక్ర‌మ్ నాగార్జున న‌టించిన ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా నుండి లేపేశాడా..? ఆ సినిమా ఏదంటే..?

అత‌డు సినిమా క‌థ‌ను త్రివిక్ర‌మ్ నాగార్జున న‌టించిన ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా నుండి లేపేశాడా..? ఆ సినిమా ఏదంటే..?

by AJAY
Published: Last Updated on

టాలీవుడ్ లోని స్టార్ డైరెక్టర్ ల‌లో త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కూడా ఒకరు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో త్రివిక్రమ్ స్టార్ట్ డైరెక్టర్ గా ఎదిగారు. ఆయన చెప్పే డైలాగులకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే త్రివిక్రమ్ సినిమాలపై కొన్ని ట్రోల్స్ కూడా వస్తూ ఉంటాయి. త్రివిక్ర‌మ్ సినిమా కథలను ఇతర భాషల్లో వచ్చిన సినిమాల నుండి లేపేస్తాడని పోస్ట్ చేస్తుంటారు.

Also Read:  మెగాస్టార్ చిరంజీవి పెళ్లి పత్రిక చూశారా.. అందులో ఆ ఒక్క పేరు చూస్తే..!!

ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ అజ్ఞాతవాసి సినిమా విషయంలో అదే జరిగింది. ఆ సినిమాను ఓ కొరియన్ సినిమా నుండి త్రివిక్రమ్ లేపేసాడు అంటూ అప్పట్లో చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆ సినిమాలోని చాలా సీన్లు అచ్చుగుద్దిన‌ట్టు అజ్ఞాత‌వాసి సినిమాల‌నే ఉన్నాయ‌ని ట్రోల్స్ చేశారు. అంతేకాకుండా అత్తారింటికి దారేది సినిమా లోని స్టోరీ లైన్ ను ఓ హాలీవుడ్ సినిమా నుండి తీసుకున్నాడు అంటూ వార్త‌లు వచ్చాయి.

Also Read:  కృష్ణ మనసుపడ్డ ఆ టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఇదిలా ఉంటే తాజాగా త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమాను త్రివిక్రమ్ టాలీవుడ్ సినిమా నుండే తీసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగార్జున హీరోగా నటించిన రాముడు వచ్చాడు సినిమా 1996లో విడుదల అయింది. ఈ సినిమాకు ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో హీరో అమెరికా నుండి ఇండియాకు వస్తాడు. ఈ సినిమాలో రామ్ పాత్రలో నటించిన నాగార్జున గొడవలతో విడిపోయిన తమ బంధువులందరినీ మరియు గ్రామస్తులను కలుపుతాడు. కాగా అతడు సినిమాను ఇదే సినిమా క‌థ నుండి స్టోరీ లైన్ తీసుకుని త్రివిక్రమ్ తెర‌కెక్కించాడు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Also Read:  Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారితో జాగ్రత్తగా ఉండాలి

Visitors Are Also Reading