సూర్యకాంతం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి సూర్యకాంతం గొప్పనటిగా పేరు సంపాదించుకున్నారు. ఒకప్పుడు సూర్య కాంతం డేట్స్ కోసం దర్శకనిర్మాతలు ఎదురు చూసేశారు. ఆమె డేట్స్ కోసం సినిమా షూటింగ్ లను సైతం వాయిదా వేసుకున్న సంధర్భాలు ఉన్నాయట. ముఖ్యంగా గయ్యాలి అత్త అనగానే ఇప్పటికీ సూర్యకాంతం చేసిన పాత్రలనే ప్రేక్షకులు గుర్తు చేసుకుంటారు.
Advertisement
సినిమాల ద్వారా గయ్యాలి అత్త అనే ట్యాగ్ సంపాదిచుకున్న సూర్యకాంతం నిజజీవితంలో మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటారని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. అయితే సూర్యకాంతం సినిమాల గురించి చాలా మందికి తెలుసు కానీ ఆమె పర్సనల్ లైఫ్ గురించి మాత్రం అతికొద్దిమందికి మాత్రమే తెలుసు. సూర్యకాంతం ఏపీలోని కాకినాడలో జన్మించారు. మద్రాసుకు చెందిన ఓ జడ్జిని పెళ్లి చేసుకోవడం ద్వారా ఆమె మాద్రాసులో నివసించాల్సి వచ్చింది.
Advertisement
ఆ తరవాత హైదరాబాద్ లో ఇంటిని నిర్మించుకుని చివరివరకూ హైదరాబాద్ లోనే ఉన్నారు. అయితే సినిమాలలో గయ్యాలిగా నటించినప్పటికీ ఆమె ఎన్నో గొప్పసేవలు చేశారట. హైదరాబాద్ కాకినాడతో పాటూ ఇతర ప్రాంతాలలో సత్రాలను ఏర్పాటు చేసి అనాథలను చేరదీశారట. అంతే కాకుండా చెన్నై లో ఎంతోమంది భర్తలేని స్త్రీలను ఆర్థికంగా ఆదుకున్నారట.
ఇక సూర్యకాంతం భర్త వృత్తి రిత్యా జడ్జి అయినప్పటికీ షూటింగ్ లో సూర్యకాంతం బిజీగా ఉంటే ఆమె కోసం స్టూడియోల ముందు వేచి చూసేవారట. ఇదిలా ఉంటే సూర్యకాంతం భౌతికంగా ఈ లోకానికి దూరం అయినా సినిమాల ద్వారా తాను నటించిన పాత్రల ద్వారా ఎప్పుడూ తెలుగు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయారు.