Home » అందాల తార రాశి మూడు పెళ్లిళ్లు చేసుకుందా..? ఎవ‌రూ ఊహించని ట్విస్ట్.!

అందాల తార రాశి మూడు పెళ్లిళ్లు చేసుకుందా..? ఎవ‌రూ ఊహించని ట్విస్ట్.!

by AJAY
Ad

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన రాశి ఆ త‌ర‌వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. త‌న అందంతో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసి రాశి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రాశి గ్లామ‌ర్ షో కు దూరంగా ఉంటూ ఎక్కువ‌గా కుటుంబ క‌థా చిత్రాల‌తోనే ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఆమె అందం అభిన‌యానికి అప్ప‌ట్లో అభిమానులు ఫిదా అయ్యారు. రాశి దాదాపు టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అంద‌రికీ జోడీగా న‌టించింది.

Advertisement

రాశి కెరీర్ లో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక ప్ర‌స్తుతం రాశి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సీరియ‌ల్స్ లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా న‌టిస్తోంది. సినిమాల విష‌యం ప‌క్కన పెడితే రాశి ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి మాత్రం చాలా మందికి తెలియదు. కాగా రాశి ఎప్పుడూ వార్త‌ల్లో వివాదాల‌తో నిల‌వ‌లేదు కానీ తాజాగా ఆమె గురించి ఓ వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Advertisement

రాశి అనేక‌కార‌ణాల వ‌ల్ల మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వ‌చ్చింద‌ట‌. రాశికి 18 ఏళ్లు ఉన్న‌ప్పుడే త‌మిళ ద‌ర్శ‌కుడు అశోక్ సామ్రాట్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంద‌ట‌.ఇంట్లో పెళ్లికి నో చెప్ప‌డంతో రాశి అశోక్ సామ్రాట్ తో ఇంటి నుండి పారిపోయి పెళ్లి చేసుకుంద‌ట‌. కానీ ఆ త‌ర‌వాత ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ద‌లు రావ‌డంతో అత‌డితో విడిపోయిందని టాక్.

ఇక ఆ త‌ర‌వ‌త మ‌న‌సిచ్చి చూడు ద‌ర్శ‌కుడు సురేష్ వ‌ర్మ‌ను వివాహం చేసుకుంద‌ట‌. ఆ త‌ర‌వాత వీరిద్ద‌రి మ‌ధ్య కూడా మ‌న‌స్ప‌ర్ద‌లు రావ‌డంతో అత‌డికి కూడా విడాకులు ఇచ్చింద‌ట‌. అంతే కాకుండా సురేష్ వ‌ర్మ‌తో రాశి విడాకులు తీసుకున్న త‌ర‌వాత శ్రీనివాస్ అనే వ్య‌క్తిని వివాహం చేసుకున్నార‌ట‌. అలా రాశి త‌న కెరీర్ లో మూడు పెళ్లిళ్లు చేసుకుంది అని టాక్ ఉంది. అయితే ఈ విష‌యం పై రాశి ఎప్పుడూ స్పందించ‌లేదు.

Visitors Are Also Reading