Telugu News » Intiti Gruhalakshmi 4th May Today Episode : తుల‌సి మళ్లీ పాటలు పాడ‌బోతుందా..? అస‌లు ట్విస్ట్ ఏమిటంటే..?

Intiti Gruhalakshmi 4th May Today Episode : తుల‌సి మళ్లీ పాటలు పాడ‌బోతుందా..? అస‌లు ట్విస్ట్ ఏమిటంటే..?

by Anji

Intiti Gruhalakshmi 4th May Today Episode: ఇంటింటి గృహ‌ల‌క్ష్మి సీరియ‌ల్ తాజా ఎపిసోడ్ అన‌గా ఇవాళ మే 4, 2022 బుధ‌వారం 623 ఎపిసోడ్ గురించి చూద్దాం. ప్ర‌వ‌ళిక ఉద‌యం జాగింగ్ వ‌చ్చి తుల‌సి కోసం ఎదురుచూస్తుంటుంది. ఇంత‌లోనే తుల‌సి డ్రెస్ వేసుకుని దాని మీద కొంగు క‌ప్పుకుని వ‌స్తుంది. త‌న‌ను చూసి న‌వ్వుతుంది ప్ర‌వ‌ళి. నీకు జ్వ‌ర‌మొచ్చింది అని తుల‌సిని అడుగుతుంది ప్ర‌వ‌ళిక‌. తుల‌సి ఏమి లేద‌ని చెబుతుంది. కొంగు ఎందుకు క‌ప్పుకున్నావ‌ని అడగ‌గా.. జాగింగ్ డ్రెస్ ఎవ్వ‌రికీ క‌నిపించ‌కుండా క‌ప్పుకున్నాను అని చెబుతుంది. దీంతో ప్ర‌వ‌ళిక కాస్త న‌వ్వుతుంది. నేను వ‌స్తుంటే నా జాగింగ్ డ్రెస్ చూసి అంద‌రూ విచిత్రంగా చూస్తున్నార‌ని.. నాకు ఇబ్బందిగా ఉంది. నేను ఇంటికి వెళ్తాను అంటుంది తుల‌సి.

Ads

Intiti Gruhalakshmi 4th May Today Episode

ఒక్క నిమిషం ఈ జాగింగ్ డ్రెస్ మీద ఇక్క‌డ నిల‌బ‌డు. నిన్ను ఎవ్వ‌రైనా చూస్తే నువ్వు రేప‌టి నుంచి జాగింగ్ డ్రెస్ వేసుకోకు.. జాగింగ్ కోసం కూడా రాకు అంటుంది. త‌ను క‌ప్పుకున్న ఆ సాల్వా తీసేస్తుంది. ఎవ్వ‌రూ త‌న‌ను చూడ‌రు. ఇద్ద‌రూ జాగింగ్ డ్రెస్‌లో జాగింగ్ చేస్తుంటారు. మ‌రొక‌వైపు లాస్య‌, నందు ఇద్ద‌రూ ఈ పార్కుకే వ‌చ్చి జాబింగ్ చేయ‌డం విశేషం. ఆ త‌రువాత ఇక నీ సిగ్గు పోయిందా.. రేప‌టి నుంచి వ‌స్తావా అని అడుగుతుంది. వ‌స్తా అని చెబుతుంది తుల‌సి. ప్ర‌వ‌ళిక‌, తుల‌సి మాట్లాడుకోవ‌డం నందు, లాస్య చూసి షాక్ అవుతారు. ప్ర‌వ‌ళిక వెళ్లిన త‌రువాత తులసి ఇటువైపు వెళ్లిపోతుండ‌గా తుల‌సిని నందు పిలుస్తాడు. నువ్వు ఏంటి..? నువ్వు చేస్తున్న ప‌నులు ఏంటి అని నిల‌దీస్తాడు. నువ్వెవ‌రో తెలుసుకోవ‌చ్చా అని అడుగుతుంది. ఈయ‌న ఎవ‌రు మీ ఆయ‌నా.. ఇలా రోడ్డు మీద వెళ్లే ప్ర‌తి ఒక్క‌రి డ్రెస్ పై కామెంట్ చేస్తారా..? అని తుల‌సి అంటుంది.

టాపిక్ మార్చ‌కు తుల‌సి అని నందు అంటాడు. ముగ్గురు పిల్ల‌ల త‌ల్లివి. కూతురు పెళ్లి చేయాలి. అన్ని మ‌రిచి పోయి ఇలాంటి డ్రెస్ వేసుకుని తిర‌గ‌డం ఏంటి అని నందు అడ‌గ్గా.. అస‌లు మీ బాద ఏమిటో ఎందుకు ఇలా గొంతు చించుకుని అరుస్తున్నారో నాకు అర్తం కావ‌డం లేదంటుంది తుల‌సి. మీకు నాకు సంబందం ఏమిటి..? నేను ఒక‌ప్పుడు మీ భార్య‌ను.. ఇప్పుడు కాదు. విడాకుల‌తో ఆ బంధం ఎప్పుడో తెగిపోయింది. ఇప్పుడు మీతో నాకు.. నాతో మీకు ఎలాంటి సంబందం లేదు. నా మీద మీకు ఎలాంటి అధికారం కూడా లేద‌ని అర్థం అయిందా అంటుంది తుల‌సి. ఎవ‌రైనా మీ ముందు నా గురించి మాట్లాడితే ఉక్రోష‌ప‌డ‌డం కాదు. వాడి చెంప చెళ్లుమ‌నిపించు అని తుల‌సి అంటుంది. నా పిల్ల‌లు, మా అమ్మ‌నాన్న నీ ద‌గ్గ‌ర ఉన్నంత వ‌ర‌కు మా ప‌రువు నీ మీద ఆధార‌ప‌డి ఉంటుందంటాడు నందు.

ఇలాంటి బ‌ట్టలు వేసుకొని తిరిగితే మీ ఇంటి ప‌రువు పోతుందా అని అడుగుతుంది. నేను మాజీ కోడ‌లును. కానీ నీ ప‌క్క‌న నిల‌బ‌డింది క‌దా త‌ను నిజ‌మైన కోడ‌లు. మీకు ఏమైనా అనాల‌నిపిస్తే త‌న‌ను అనండి. బుద్ది చెప్పాల‌నుకుంటే త‌న‌కు చెప్పండి నాకు అని తుల‌సి అంటుంది. మీ ఆవిడ రోజు వేసుకునే బ‌ట్ట‌ల క‌న్నా నేను ఈరోజు వేసుకున్న బ‌ట్ట‌లు చాలా సంస్కారంగా ఉన్నాయంటుంది తుల‌సి. నీ భార్య‌కు ఒక నీతి.. నాకు నీతినా… ముందు ఆవిడ‌ను సంస్క‌రించుకోండి. న‌న్ను అడిగే హ‌క్కు మీకు లేద‌ని చెప్పి అక్క‌డి నుండి వెళ్లిపోతుంది తుల‌సి. వాట్ ఏ చేంజ్ తుల‌సి అని చెప్పి ప్ర‌వ‌ళిక కూడా సంతోషంతో అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. క‌ట్ చేస్తే ప్రేమ్ నిద్ర‌పోతుంటాడు. శృతికి జ్వరం త‌గ్గుతుంది. త‌ను అన్ని ప‌నులు చేస్తుంటుంది. అప్పుడే లేచి ప్రేమ్ ఇంత పొద్దున్నే శృతి ఏమి చేస్తుంద‌ని అనుకుంటాడు.

త‌ను వంట చేయ‌డం చూసి షాక‌వుతాడు. నువ్వు అప్పుడే ప‌నులు ఎందుకు చేస్తున్నావ‌ని అడుగుతాడు. కాస్త బ‌లం రాగానే వంటింట్లో దూర‌య‌డ‌మేనా అంటాడు ప్రేమ్‌. కానీ త‌న‌ను చేయ‌నీయ‌డు ప‌ని. శృతి వ‌ద్దు ప్రేమ్ ఏమి కాదు నేను చేస్తానంటుంది. ఇంత‌లో శృతికి ఫోన్ వ‌స్తుంది. ఆ ఫోన్ ను ఎత్తుతాడు ప్రేమ్‌. ప‌నిలోకి వ‌స్తున్నావా లేదా అని ఆ మ‌హిళ ఫోన్ చేస్తుంది. మీరు ఎవ‌రండి ఏం మాట్లాడుతున్నారు. శృతి ఫోన్ తీసుకొని మేడ‌మ్ నేను మేడ‌మ్ నేను వ‌స్తున్నాను అంటుంది శృతి. ఎవ‌రు మీ మేనేజ‌రా..? త‌ల‌బిరుసుగా మాట్లాడుతుందేంటి..? నువ్వు ఏమైనా ప‌ని మ‌నిషివా..? రాన‌ని చెప్పెయ్ అంటాడు ప్రేమ్‌. ఏమి కాదులే.. వాళ్లు అలాగే ఉంటార‌ని చెప్పి అక్క‌డి నుండి వెళ్లిపోతుంది.


ఇక మ‌రొక వైపు పార్కు నుంచి తుల‌సి ఇంటికి వ‌స్తుంది. తుల‌సి వేసుకున్న డ్రెస్ చూసి దివ్య షాక్ కు గుర‌వుతుంది. ప‌రందామ‌య్య‌, అనసూయ ఆమె డ్రెస్ చూసి షాక్ అవుతారు. నీలో ఇంత మార్పు అని అన‌సూయ అంటుంది. నీలో వ‌చ్చిన మార్పు చూస్తుంటే.. చాలా సంతోషంగా ఉందంటాడు ప‌రందామ‌య్య‌. ఈ మార్పున‌కు కార‌ణం ప్ర‌వ‌ళిక అంటుంది తుల‌సి. ఆ త‌రువాత ఇంట్లో ఆర్థికంగా ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు రావ‌డంతో ఏమి చేయాలో తులసికి అర్థం కాదు. ప్ర‌వ‌ళిక‌ను క‌లుస్తుంది. నీకు తెలిసిన ప‌నేచేయ్ అంటుంటుంది. ముఖ్యంగా గొంతు స‌వ‌రించుకో.. పాట‌లు పాడ‌డం.. మొద‌లు పెట్టంటుంది. ఆ త‌రువాత ఏమి జ‌రుగుతుందో తెలియాలంటే రేప‌టి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.

Also Read : 

Janaki Kalaganaledu 4 May Today Episode: జాన‌కిపై జ్ఞానాంబ సీరియ‌స్‌.. అంత‌లోనే పెద్ద ట్విస్ట్‌.. ఏం జ‌రిగిందంటే..?

Karthika Deepam 4 May Today Episode : హిమ‌ను ప్రేమిస్తున్నాన‌ని నిరుప‌మ్ జ్వాల‌తో చెబుతాడా..? జ‌్వాల ఏం చేస్తుందంటే..?


You may also like