Home » చిరంజీవి సతీమణిది ఇంత పెద్ద మనసా…?

చిరంజీవి సతీమణిది ఇంత పెద్ద మనసా…?

by Venkatesh
Ad

మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖమ్మ పెద్దగా బయటకు రారు. ఆమె ఫోటోలు వచ్చినా సరే మీడియాలో ఆమె హడావుడి అంతగా ఉండదు. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఆసక్తి కూడా చూపించరు. తండ్రి అల్లు రామ లింగయ్యకు టాలీవుడ్ లో ఏ రేంజ్ లో పేరుందో అందరికి తెలిసిందే. ఆయన కుమారుడు అల్లు అరవింద్ టాలీవుడ్ లో అగ్ర నిర్మాత. భర్త చిరంజీవి… టాలీవుడ్ ని శాసిస్తున్నారు. కొడుకు టాలీవుడ్ లో స్టార్ హీరో… మేనల్లుడు స్టార్ హీరో.

అయినా సరే సురేఖమ్మ మాత్రం బయటకు రావడానికి ఇష్టపడరు. అయితే ఆమె సేవా కార్యక్రమాల విషయంలో చాలా స్పీడ్ గా ఉంటారు. మీడియా ముందు ఏ హడావుడి లేకుండా ఉండే సురేఖమ్మ… తెరవెనుక మాత్రం సేవా కార్యక్రమాలను చాలా స్పీడ్ గా చేస్తూ ఉంటారు. చిరంజీవి పేరుతో నడిచే సేవా కార్యక్రమాలు అన్నీ కూడా ఆమెనే చూసుకుంటారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, వంటివి ఆమె నిర్వహిస్తారు.

Advertisement

Advertisement

ఇక ఆమె మనసు ఎంత మంచిదో… చిరంజీవి… మహిళా దినోత్సవం రోజున బయట పెట్టారు. తన కెరీర్ విషయంలో ఆమె చాలా జాగ్రత్తలు తీసుకున్నారని… తన చెల్లెళ్ళ విషయంలో కూడా ఎంతో ఉదారంగా ఉంటారని చెప్పారు. చిరంజీవికి కోకాపేటలో ఉన్న కొన్ని ఎకరాల్లో ఫాం హౌస్ కట్టాలని చూసారు. కాని ఆ విషయంలో ఆమె అభ్యంతరం చెప్పి… తన ఆడపడుచులకు కూడా వాటా ఇప్పించారట. తన తమ్ముళ్ళను కూడా కొడుకులుగా చూసారని చెప్పుకొచ్చారు. కోకాపేట భూముల ధర ఇప్పుడు కొట్లలో ఉంది. అయినా సరే ఆ భూములను ఆడపడుచులకు ఇప్పించారు సురేఖమ్మ.

Visitors Are Also Reading