Home » జేడీ చక్రవర్తికి అంతర్జాతీయ అవార్డు.. ఆ సినిమాకేనా ?

జేడీ చక్రవర్తికి అంతర్జాతీయ అవార్డు.. ఆ సినిమాకేనా ?

by Anji
Ad

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోలలో జేడీ చక్రవర్తి ఒకరు. విలక్షణమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఇక  ఆ తర్వాత సహాయ నటుడిగా, ప్రతి నాయకుడిగా కూడా మెప్పించారు జేడీ. చాలా కాలంగా  ఇండస్ట్రీకి దూరంగా  ఉంటున్న జేడీ చక్రవర్తికి తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది. నైజీరియాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జేడీ చక్రవర్తికి అవార్డు వరించింది. 

Also Read :  యాంకర్ శ్రీముఖి ఒక్కరోజు సంపాదన ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుద్ది..!!

Advertisement

Advertisement

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో ఈ అవార్డు వచ్చినట్టు తెలుస్తోంది. ‘దహిణి ది విచ్’ అనే  సినిమాలో ఆయన నటనకుటాను   ఉత్తమ సహాయ నటుడిగా ఈ అవార్డు లభించింది.ఇదివరకే ఈ మూవీ ఆస్ట్రేలియాలో కూడా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా అవార్డు అందుకుంది. రాజేష్ టచ్ రివర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సునీత కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో జేడీ చక్రవర్తితో పాటు.. తనిష్ఠ చటర్జీ, శృతి జయన్ కీలక పాత్రలలో  కనిపించారు. ఇప్పటికే ఈ సినిమాకు 18 అంతర్జాతీయ అవార్డులు  వచ్చాయి.  

Manam News

అంతర్జాతీయ స్థాయిలో జేడీ చక్రవర్తికి ఈ గుర్తింపు లభించడంతో ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జేడీ చక్రవర్తి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమానే కాకుండా.. వన్ బై టూ, మనీ మనీ, గులాబీ సినిమాలతో కథానాయకుడిగా అలరించారు. ఆ తర్వాత మృగం, దెయ్యం, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా వంటి సినిమాలతో మంచి  విజయాన్ని అందుకున్నాడు.

Also Read :  బెల్లంకొండ ‘ఛత్రపతి’ ట్రైలర్ చూశారా..? అద్భుతమే..!

Visitors Are Also Reading