Home » తెలుగు సినిమాల్లో మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు.. ఏంటో తెలుసా..?

తెలుగు సినిమాల్లో మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు.. ఏంటో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

చిత్ర పరిశ్రమలో ఎన్నో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనకు తెరమీద కనిపించేది ఒకటి తెరవెనుక జరిగేది ఇంకొకటి. అలాంటి ఘటనలు కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీల ద్వారా మనకు తెలుస్తాయి. అలాంటి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సీతారామయ్యగారి మనవరాలు చిత్రంలో ఏఎన్నార్ తొలిసారిగా విగ్గు లేకుండా నటించాడట. విగ్గు లేకుండా చేస్తేనే పాత్ర హైలెట్ అవుతుందని డైరెక్టర్ చెప్పారట. తరుణ్ నటించిన నువ్వేకావాలి సినిమా ఆఫర్ మొదటిగా సుమంత్ కు వెళ్లిందట. ఆయన యువకుడు సినిమాతో బిజీగా ఉండటంవల్ల నువ్వేకావాలి సినిమాను వదులుకున్నాడట.

Advertisement

రవితేజ ముందుగా నిన్నే పెళ్ళాడతా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడట. గమ్యం సినిమాలో అల్లరి నరేష్ చనిపోయే సీన్ ఉంటుంది కదా. ఆ సీన్ అల్లరి నరేష్ బర్త్డే రోజే చిత్రీకరించారట. లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ ప్రతి రోజు టీవీలో జ్యువెలరీ ప్రకటనలో కనిపిస్తాడు కదా. ఈయన ఇంతకు ముందు లింగా సినిమాలో కూడా నటించాడు. మన్మధుడు సినిమాలో ప్యారిస్ లో వంతెన దాటడానికి నాగార్జున భయపడతాడు. అది ఆన్ స్క్రీన్ లో మాత్రమే, కానీ ఆఫ్ స్క్రీన్ లో భయపడింది మాత్రం సోనాలి బింద్రే. రాజమౌళి ఈగ సినిమాలో తాగుబోతు రమేష్ క్యారెక్టర్ ను మొదట రవితేజను అనుకున్నారట జక్కన్న.

Advertisement

 

కానీ తాగుబోతు క్యారెక్టర్ ని కామెడీగా చేయాలని తాగుబోతు రమేష్ ని తీసుకున్నారట. 1977లో వచ్చిన యమగోల సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో మొదటిగా బాలకృష్ణను అనుకున్నారట. బాలకృష్ణ చదువు దృష్ట్యా ఎన్టీఆర్ వద్దన్నాడట. అందుకు బాలయ్య పాత్రను ఎన్టీఆర్ చేశారు. తన వ్యక్తిగత మేకప్ మ్యాన్ తో తప్ప వేరే వారితో మేకప్ వేసుకొని ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని పుణ్యభూమి నాదేశం అనే పాటకు మోహన్ బాబు చేత మేకప్ వేయించుకున్నాడు ఎన్టీఆర్. అరుంధతి అంటే అనుష్క నటించిన సినిమా గుర్తుకు వస్తుంది. కానీ అదే పేరుతో 1999లో సౌందర్య ఓ చిత్రంలో నటించింది.

ALSO READ;

ఛత్రపతి సినిమాలో ఆ సీన్ నచ్చకపోయినా రాజమౌళి ఎందుకు ఛత్రపతి సినిమాలో పెట్టాడు ?

రీమేక్ గా వచ్చి ఒరిజినల్ కంటే ఎక్కువ సూపర్ హిట్ కొట్టిన సినిమాలు.. ఏంటో తెలుసా..?

 

Visitors Are Also Reading