Home » కృష్ణ ఆసుపత్రిలో ఉన్నప్పుడు వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఇవే..!

కృష్ణ ఆసుపత్రిలో ఉన్నప్పుడు వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఇవే..!

by Anji
Ad

సూపర్ స్టార్  కృష్ణ మరణించాడనే వార్తను అభిమానులు, సినీ ప్రముఖులు ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం  కృష్ణ అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే. కేవలం 10 నెలల వ్యవధిలోనే ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయిన మహేష్ బాబు కుటుంబం తీవ్ర మనోవేదనకు గురవుతుంది. గుండెపోటు, ఆర్గాన్ డ్యామేజ్ వంటి సమస్యలతో  కృష్ణని కాపాడుకునే అవకాశం ఉందట. కానీ  కృష్ణ కుటుంబం మాత్రం ఆ నిర్ణయం తీసుకోలేదట. ఎందుకు వారు ఆ నిర్ణయం తీసుకోలేదనే డౌట్ చాలా మందికి వస్తుంటుంది. కానీ వాస్తవానికి  కృష్ణ ఫ్యామిలీ గొప్ప నిర్ణయమే తీసుకుంది. 

Also Read:  2022లో ఈ లోకాన్ని విడిచిన 10 మంది సెల‌బ్రెటీలు వీళ్లే..!

Advertisement

 

ఎందుకు అనగా..?  ECMO ఎక్స్ ట్రా కార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అంటారు. ఇక ఈ విధానం ద్వారా కృష్ణని కాపాడుకునే అవకాశముంది. కానీ ఇది అంత తేలికైనది కాదు. దీనిని చేసే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విధానానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. దీనిని అమలు చేయాలంటే మనిషి శారీరకంగా దృఢంగా ఉండాలి. కానీ కృష్ణగారు మాత్రం అంత బలంగా లేరు. అదేవిధంగా ఈ విధానం ఫాలో అయ్యే సమయంలో రక్తం గడ్డకట్టకుండా మెషిన్ లోకి వెళ్లడానికి ట్యాబ్లెట్స్ ఇస్తారు. వాటి వల్ల బ్లీడింగ్ జరిగే అవకాశం ఉంటుందట.

Advertisement

Also Read :   ఆ ప్రేమకు ఫిదా అయిన సమంత…మళ్లీ అక్కినేని ఇంట్లో కుడి కాలు పెట్టబోతుందా…?

అదేవిధంగా రక్తం గడ్డ కట్టడం, ట్యూబ్ లలో గాలి చేరడం వంటివి జరుగుతాయి. ఈ క్రమంలో కృష్ణ కి మళ్లీ హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశముంది. ఇవన్నీ తట్టుకుని కృష్ణ శరీరం సహకరించినా ప్రాణం నిలబడినా సాధారణ స్థితికి వచ్చే అవకాశం మాత్రం లేదు. ఈ విషయాన్ని డాక్టర్లు కృష్ణ కుటుంబంతో చెప్పారు. ఇప్పటికే ఇద్దరు భార్యలను, కొడుకుని కోల్పోయిన కృష్ణ మానసికంగా కుంగిపోయిన ఈ ఎక్మో ట్రీట్ మెంట్ ని చేయించుకునే స్థితిలో లేరు. అందుకే పోయే ముందు కూడా ఆయనను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక కృష్ణ కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

Also Read : కృష్ణ రెండో పెళ్లి సమయంలో ఇందిరా దేవి పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా ? 

Visitors Are Also Reading