అమెరికాలో ఉన్నత విద్య చదువుతు్న వెంకటేష్ అకస్మాత్తుగా డి.రామానాయుడు పిలుపు మేరకు సినిమాలలో నటించడానికి ఇండియా వచ్చారు. ఆ క్రమంలో 1986లో సురేష్ ప్రొడక్షన్ కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కలియుగ పాండవులు చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో వెంకటేష్, కష్భూ హీరో, హీరోయిన్లుగా నటించారు.
Advertisement
ఈ సినిమా సూపర్ హిట్ సాధించినా కానీవెంకటేష్‌కు సినిమాలపై అంతగా ఆసక్తి ఉండేది కాదు. ఆ తరువాత ఆయన మెల్లగా సినిమాలపై అవగాహన, అభిమానం పెంచుకున్నారు.ఈ తరుణంలోనే 1990 లో సురేష్ ప్రొడక్షన్ బి.గోపాల్ దర్శకత్వంలో బొబ్బిలిరాజా చిత్రం విడుదల అయింది. అడవి నేపథ్యంలో పరుచూరి బ్రదర్స్ అందించిన పక్కా కమర్షియల్ కథా చిత్రం బొబ్బిలిరాజా అత్తగా వాణిశ్రీ నటన, దివ్యభారతి అందచందాలు ఇళయరాజా సంగీతం ఈ సినిమాను బ్లాక్ బాస్టర్‌గా నిలిపింది.
1993 సౌదామిని క్రియేషన్, రవిరాజా శెట్టి దర్శకత్వంలో కొండపల్లి రాజా చిత్రం విడుదలైంది. వెంకటేష్, నగ్మా ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. స్నేహానికి ఉన్న ప్రాధాన్యతను చెబుతూ వెంకటేష్, సుమన్ తమదైన పాత్రలో అద్భుతంగా నటించారు. అరుదైన ఈ కాంబినేషన్ ఉపయోగించుకొని రవిరాజా పినిశెట్టి సినిమాను విజయం వైపు నడిపించారు.
Advertisement
1995 ఎల్వీ ఎస్ ప్రొడక్షన్, ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో పోకిరిరాజా చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో వెంటకేష్, రోజా, ప్రతిభాసిన్హ, శుభశ్రీ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఆంఖే అనే హిందీ చిత్రం ఆధారంగా పోకిరిరాజా సినిమా తీయడం జరిగింది. విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసారు. పరుచూరి బ్రదర్స్ అందించిన డైలాగ్స్, రాజ్‌కోటి స్వరపరిచిన గీతాలు సినిమాను ఏమాత్రం బాక్సాపీస్ వద్ద కొనసాగేలా చేయలేకపోయాయి.
1999లో సూపర్ గుడ్ ఫిలింస్, ముప్పలనేని శివ దర్శకత్వంలో రాజా చిత్రం విడుదల అయింది. వెంకటేష్ హీరోగా, సౌందర్య హీరోయిన్‌గా నటించారు. ఓ తమిళ చిత్రానికి రీమెక్‌గా రూపొందించబడింది. వెంకటేష్, సౌందర్య అధ్భుత నటనతో సినిమాను విజయవంతం చేశారు. ఈ సినిమా మూడు సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కించుకుంది. ఎస్.ఏ.రాజ్‌కుమార్ స్వరపరిచిన గీతాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాజా అనే టైటిల్‌తో వచ్చిన నాలుగు సినిమాలలో ఒక్క పోకిరి రాజా చిత్రం మాత్రమే వెంకటేష్‌ను నిరాశ పరిచింది. మిగతా చిత్రాలు అన్నీ విజయవంతం అయ్యాయి.