Home » బాహుబలి ఇంటర్వెల్ రాజమౌళి మొదటగా అనుకున్నట్లు తీసుంటే.. సినిమా మరోలా ఉండేదేమో..

బాహుబలి ఇంటర్వెల్ రాజమౌళి మొదటగా అనుకున్నట్లు తీసుంటే.. సినిమా మరోలా ఉండేదేమో..

by Mounika
Published: Last Updated on
Ad

ఒకే ఒక్క సినిమా తెలుగు చిత్ర సీమ స్టామినా ఏంటో ప్రపంచవ్యాప్తంగా తెలియ చెప్పింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ లో ఆల్ టైం రికార్డ్లను క్రియేట్ చేసింది. ఈ చిత్రంతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనుష్క, తమన్నా, రానా దగ్గుపాటి, రమ్యకృష్ణ, సత్య రాజ్ , నాజర్ వంటి భారీతారాగణంతో చిత్రీకరించిన బాహుబలి చిత్రం 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. జూలై 10, 2015 లో విడుదలైన బాహుబలి చిత్రం ప్రేక్షకులకు ముందు వచ్చి 8 సంవత్సరాలను పూర్తి చేసుకుంది.

Advertisement

 

బాహుబలి ది బిగినింగ్ చిత్రం వచ్చి ఎనిమిది సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఈ చిత్రంలో బాహుబలి విగ్రహాన్ని పైకి లేపినప్పుడు ఇంటర్వెల్ వస్తుంది అనే విషయం అందరికి తెలిసిందే. కానీ రాజమౌళి ఈ చిత్రంలో మొదట ఇంటర్వెల్ సీక్వెల్ని ఒక విధంగా అనుకొని మరొక విధంగా సెట్ చేశారట. మాహిష్మతి ఊపిరి పీల్చుకో.. నా కొడుకు వచ్చాడు. బాహుబలి తిరిగొచ్చాడు.. అంటూ దేవసేన డైలాగ్స్ చెప్తున్నా సమయంలో నడుచుకుంటూ వస్తున్న శివుడినిపై బాహుబలి రూపాన్ని చూపిస్తూ ఇంటర్వెల్ సెట్ చేద్దాం అనుకున్నారట రాజమౌళి.

bahubali

శివుడు మహిష్మతి సామ్రాజ్యంలోకి భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇలా పంచభూతాలు దాటుకొని అడుగు పెడతాడు. కానీ రాజమౌళి మొదటిగా ఈ సన్నివేశాలను ఇలా చిత్రీకరించాలని అనుకోలేదట. శివుడు మహిష్మతి సామ్రాజ్యానికి వచ్చేముందు సైనికులతో పోరాటం చేస్తాడు. అందులో ఒక సైనికుడు ప్రభూ… నన్ను ఏమీ చేయవద్దు అంటూ శివుడిని వేడుకుంటాడు.. ఇక్కడి నుంచి తప్పించుకొని వచ్చిన సైనికుడు బిజ్జలదేవుడికి జరిగిన విషయం చెబుతాడు.

Advertisement

కానీ బిజ్జలదేవుడు సైనికుడి మాటలు నమ్మడు. ఎంతో అహంకారంతో బాహుబలి చచ్చిపోయాడు. వాడి ప్రాణాలను నలిపి నలిపి మట్టిలో కలిపేసాం.. అని చెప్పే సమయంలో శివుడు మట్టి గోడలను బద్దలు కొట్టుకుంటూ రావాలి. అలా బిజ్జలదేవుడు చెప్పే ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క దశను దాటుకుంటూ వచ్చేలా సన్నివేశాలను రూపొందించాలని అనుకున్నాం. అంతేకాకుండా ఆ సన్నివేశాల దగ్గరే ఇంటర్వెల్ కూడా వేద్దామని అనుకున్నాం.. కానీ విగ్రహాన్ని పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్ వేస్తే బాగుంటుందని భావించి బిజ్జలదేవుడు డైలాగ్స్ అన్ని తీసివేయడం జరిగిందట. అంతేకాకుండా బాహుబలి బిగినింగ్ లో శివుడి పాత్రతో పాటు ఒక కోతిని కూడా పెట్టాలని అనుకున్నారట రాజమౌళి.

prabhas rajamouli

జలపాతం సన్నివేశాల దగ్గర కొమ్మను పట్టుకుని దూకునప్పుడు ఒక్కసారిగా శివుడు కింద పడిపోతాడు. కానీ కోతి మాత్రం దూకేసి పైకి వెళ్ళిపోయి కొన్ని నగలు ఉన్న మూటతో కిందకు వస్తుందని.. నగల మూట చూసినా శివుడు అవంతిక రూపాన్ని చెక్కుతాడని సన్నివేశం రాసుకున్నాము. కానీ కోతిని పెట్టి సినిమా తీయడం నిబంధనలకు విరుద్ధమని సెన్సార్ వాళ్ళు చెప్పడంతో అవంతిక మాస్క్ ఐడియా డెవలప్ చేసామని రాజమౌళి ఓ సందర్భంలో ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

ఫ్లాప్ సినిమా రూ.100 కోట్లు రాబట్టిన పవన్ కళ్యాణ్ మూవీ ఏదో తెలుసా ?

షారుఖ్ సినిమాలో సౌత్ స్టార్ హీరో.. జవాన్ ట్రైలర్‏తో సస్పెన్స్..!

salaar : సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న సలార్ టీజర్..! ప్రభాస్ ఫాన్స్ కి పండగే పండగ..!

 

 

Visitors Are Also Reading