Home » ఖ‌డ్గం చిత్రంలో సంగీత బెడ్ రూమ్ సీన్ వెనుక అస‌లు క‌థ ఏమిటంటే..?

ఖ‌డ్గం చిత్రంలో సంగీత బెడ్ రూమ్ సీన్ వెనుక అస‌లు క‌థ ఏమిటంటే..?

by Anji
Ad

కృష్ణ‌వంశీ సినిమా అంటే అందులో త‌ప్ప‌కుండా కుటుంబ నేప‌థ్యం ఉంటుంది. దాదాపుగా ఎక్కువ శాతం ఫ్యామిలీకే ఎక్క‌వ ప్రాధాన్య‌త‌ను ఇస్తారు ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ. ఆయ‌న తెర‌కెక్కించిన చిత్రం ఖ‌డ్గం.2002లో వ‌చ్చిన ఈ సినిమా భార‌త్‌లో హిందూ, ముస్లింల మ‌ధ్య స్నేహ‌బంధం నేప‌థ్యంలో తెర‌కెక్కించారు. దేశంజోలికి వ‌స్తే.. అంద‌రం ఒక్క‌ట‌వుతామంటూ తెలిపే సందేశంతో రూపొందించారు.

Advertisement

ఈ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను కురిపించింది. ఈ సినిమాలో శ్రీ‌కాంత్‌, ర‌వితేజ‌, ప్ర‌కాశ్‌రాజ్‌, బ్ర‌హ్మాజీ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. ఈ చిత్రానికి నంది అవార్డుల‌తో పాటు ఎన్నో ప్ర‌శంస‌లు సైతం ద‌క్కాయి. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే, కిమ్ శ‌ర్మ, సంగీత వీరు ముగ్గురు హీరోయిన్‌లుగా న‌టించారు.

Also Read: ఆ హీరోయిన్ నటనకు త్రివిక్రమ్ ఫిదా…మహేష్ బాబు పక్కన ఛాన్స్…!

Advertisement

అయితే ఖ‌డ్గం సినిమాలో సంగీత పాత్ర గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలంటే సినిమా అవ‌కాశాల కోసం ప‌ల్లెటూరి నుంచి సిటీకి వ‌చ్చిన అమ్మాయి పాత్ర‌ను పోషించింది. ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు బెడ్‌రూమ్‌లోకి వెళ్లాల్సిన సీన్ ఉన్న‌ది. సంగీత ర‌వితేజ‌ను ఇష్ట‌ప‌డుతుంటుంది. అయితే సంగీత అమ్మ అయిన పావ‌లా శ్యామ‌ల త‌న కూతురును హీరోయిన్ చేయాల‌న్న కోరిక‌తో ఆమె బ‌ల‌వంతంతో అయిష్టంగానే సంగీత ఆ ద‌ర్శ‌కుడితో రూమ్‌లోకి వెళ్లుతుంది. ఆ దర్శ‌కుని ఒడిలో కూర్చొని అత‌నికి మందు తాగిస్తుంటుంది. అప్పుడు ర‌వితేజ త‌లుపు తోసుకు వ‌చ్చి ఆ సీన్ చూసి విల‌విల్లాడిపోతాడు.

Khadgam Movie

Khadgam Movie

సినిమా రంగంలో స‌హ‌జంగా హీరోయిన్ల‌కు ఇలాంటి ప‌రిస్థితే ఉంటుంద‌ని కృష్ణ‌వంశీ కూడా అందుకే ఆ సీన్ పెట్టార‌ని అప్ప‌ట్లో టాక్ వినిపించింది. టాలీవుడ్‌లో ఓ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడిని టార్గెట్ చేసే కృష్ణ‌వంశీ కావాల‌నే ఈ సీన్ పెట్టార‌ని టాక్. మ‌రొక వైపు హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ‌ను ఓ సినిమా షూటింగ్ ఓ ద‌ర్శ‌కుడు ఇబ్బంది పెట్టిన త‌రుణంలో కృష్ణ‌వంశీ కావాల‌నే ఆయ‌న‌ను టార్గెట్ చేస్తూ.. ఖ‌డ్గంలో ఈ సీన్ క్రియేట్ చేశార‌ని కూడా ప్ర‌చారం అయింది. ముఖ్యంగా ర‌మ్య‌కృష్ణ సైతం ఇండ‌స్ట్రీలో ఓ న‌టి స్టార్ హీరోయిన్‌గా ఎద‌గాలంటే త‌ప్ప‌కుండా ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు లొంగిపోవాల్సిందే అని.. వారు ర‌మ్మ‌న్న గదుల్లోకి వెళ్లాల్సిందే అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కూడా చేసారు. ఖ‌డ్గంలో ఉన్న ఆ సీజ్ వెనుక ఆంత‌ర్యం ఏమిటో ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీకే తెలియాలి.

Also Read: ర‌వితేజ ఖిలాడి నుంచి ఊర‌మాస్ తో ఫుల్ కిక్కు..!

Visitors Are Also Reading