Home » తొలుత కాద‌న్న మురారి.. ఆ త‌రువాత‌ కాళ్ల మీద ప‌డ్డాడు..!

తొలుత కాద‌న్న మురారి.. ఆ త‌రువాత‌ కాళ్ల మీద ప‌డ్డాడు..!

by Anji
Ad

తెలుగు సినిమా మ‌ద్రాస్‌లో ఉన్న రోజులు అవి. ప్ర‌ముఖ నిర్మాత మురారి గోరింటాకు సినిమా తెర‌కెక్కించాల‌ని నిర్ణ‌యించాడు. ఆ సినిమాను అప్ప‌ట్లో భారీ స్థాయిలో నిర్మించాల‌నుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం అంద‌రూ వైజాగ్‌కు బ‌య‌లు దేరారు.

కాదన్న మురారి.. కాళ్లమీద పడ్డాడు... అదీ ఎన్టీఆర్ అంటే.

Advertisement

ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్ పోలీసుల కోసం నిధులు సేక‌రించాల‌నుకున్నాడు. అందులో భాగంగానే రైలులో విశాఖ‌కు చేరుకున్నాడు. అదే స‌మ‌యంలో గోరింటాకు సినిమా గురించి త‌న‌కు తెలిసింది. దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుంతుంద‌ని తెలిసింది. ఈ సినిమా నిర్మాత ఎవ‌రో తెలుసుకుని.. గోరింటాకు సినిమా ఆర్టిస్టుల‌ను ప‌రేడ్ గ్రౌండ్ కు తీసుకురావాల‌ని కోరారు.

కాదన్న మురారి.. కాళ్లమీద పడ్డాడు... అదీ ఎన్టీఆర్ అంటే.

Advertisement

అయితే ఎన్టీఆర్ కోరిక నిర్మాత మురారికి న‌చ్చ‌లేదు. ఆయ‌న ఏదో కార్య‌క్ర‌మం పెట్టుకుంటే తాము షూటింగ్ ఆపేసి ఎందుకు వెళ్లాలి. అని సీనియ‌స్ అయ్యాడు. ఇంత‌లో దాస‌రి క‌లుగ‌జేసుకున్నాడు. ఎన్టీఆర్ గారు పిలిస్తే రాకుండా ఎలా ఉంటాం. అంద‌రం వ‌స్తామ‌ని చెప్పాడు. మురారికి దాస‌రి మాట‌లు న‌చ్చ‌లేదు. మీరు వెళ్లండి నేను రాను అన్నాడు. అప్పుడు సావిత్రి క‌లుగ‌జేసుకుంది. మురారి గారు మీమంద‌రం ఉన్నా.. ఎన్టీఆర్ గారు మీ ద‌గ్గ‌రికీ మ‌నిషిని ఎందుకు పంపించాడు. మీరు నిర్మాత కాబ‌ట్టి ఆ గౌర‌వం ఇచ్చాడు అని చెప్పింది. మొత్తానికి అంద‌రూ ఒప్పించారు మురారిని.

Remembering Nandamuri Taraka Rama Rao on his birth anniversary | The Times  of India

అయితే తాను అక్క‌డికి వ‌చ్చినా ఎన్టీఆర్‌కు దండ వేయ‌ను అని చెప్పాడు. శోభ‌న్‌బాబు న‌వ్వుతూ.. నువ్వు ఆయ‌న‌కు త‌ప్ప‌కుండా దండ వేస్తావు అని చెప్పాడు. అనుకున్న విధంగానే సాయంత్రం స‌మ‌యంలో మురారి గోరింటాకు టీమ్‌తో ప‌రేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నాడు. వెళ్ల‌గానే వీరికి ఎన్టీఆర్ ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. నిర్మాత మురారి గారికి ధ‌న్య‌వాదాలు అని చెప్పాడు. ఎన్టీఆర్ నోట ఆ మాట విన‌గానే ఆయ‌న‌కు సంతోషం క‌లిగింది. మురారి గారు అని ఎన్టీఆర్ పిల‌వ‌డంతో ఆయ‌న కాళ్ల‌ల్లో వ‌ణుకు, క‌ళ్ల‌లో భ‌యం ఏర్ప‌డింది. అప్ప‌టిక‌ప్పుడు ఎవ‌రిచ్చారో ఏమో దండ వేసి దండం పెట్టారు. ఎన్టీఆర్‌ను చూడ‌గానే కొత్త అనుభూతికి లోన‌య్యాడు నిర్మాత మురారి.

Visitors Are Also Reading