Home » నిజం సినిమాలో అతని యాక్టింగ్ నచ్చక మళ్లీ ప్రకాశ్ రాజ్ తో షూట్ చేశారు.. ఆ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా ? 

నిజం సినిమాలో అతని యాక్టింగ్ నచ్చక మళ్లీ ప్రకాశ్ రాజ్ తో షూట్ చేశారు.. ఆ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా ? 

by Anji
Ad

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాల నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై సూపర్ స్టార్ గా ఎదిగారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించే  పాన్ వరల్డ్ మూవీలో నటించనున్నాడు. అయితే మహేష్ బాబు తన కెరీర్ ప్రారంభంలో చేసిన సినిమాలలో నిజం చిత్రం ఒకటి. ఈ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ నటన పరంగా మహేష్ ని మరో మెట్టు ఎక్కించింది ఈ సినిమా. ఈ చిత్రంలో మహేష్ నటనకు నంది అవార్డు వరించింది. 

Advertisement

ఈ చిత్రంలో మహేష్ బాబు ని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చాలా ముఖ్యమైనది కావడంతో ఈ క్యారెక్టర్ ని తొలుత సీనియర్ నటుగు మురళి మోహన్ చేత చేయించారు. ఇక ఎన్ని టేకులు చేసిన ఒక్క షాట్ కూడా ఓకే చేసేవారు కాదట తేజ. దీంతో విసిసిపోయిన మురళిమోహన్ ఇంకా ఎలా కావాలో చెప్పు అలా చేస్తానని అన్నాడట. కొన్ని సందర్భాల్లో దర్శకుడు తేజ మురళి మోహన్ సీనియర్ నటుడు అని కూడా చూడకుంటా తిట్టాడట. మురళి మోహన్ తీవ్ర మనస్థాపానికి గురై పెద్ద వాళ్లంటే గౌరవం కూడా లేని ఆయన సినిమాలో నేను చేయలేను అని చెప్పారట. దీంతో ఈ సినిమాలో మురళి మోహన్ ప్లేస్ లో ప్రకాశ్ రాజ్ గారిని పెట్టి షూటింగ్ చేసారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పటికీ మహేష్ బాబు బెస్ట్ ఫెర్పామెన్స్ ఇచ్చిన 5 సినిమాల లిస్ట్ కనుక తీస్తే.. అందులో ఈ చిత్రం కూడా ఉంటుంది. 

Advertisement

Also Read :   కె.విశ్వనాథ్ మృతి..ఆయన మరణానికి అసలు కారణం ఇదే…!

Manam News

ప్రస్తుతం తేజ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందులో భాగంగానే టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు కుమారుడు అభిరామ్ తో అహింస చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రంతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారని ఆయన చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఈ చిత్రం కాబట్టి హిట్ అయితే నెక్ట్స్ పెద్ద సినిమా చేసే అవకాశముంది. తేజ కెరీర్ లో స్టార్ హీరోలని డైరెక్ట్ చేసే అవకాశమున్నప్పటికీ ఆయన ఆ ఛాన్స్ లని వదిలేశాడు. తనకు స్టార్లని డైరెక్ట్ చేయడం కన్నా యంగ్ హీరోలని కొత్త వాళ్లని డైరెక్ట్ చేయడమంటనే చాలా ఇష్టమని చెప్పారు తేజ. ఎందుకంటే వాళ్ల మీద అయితే ఎవరికీ ఏ ఎక్స్ పెక్టేషన్స్ ఉండవు  అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తేజ. ప్రస్తుతం తేజ తెరకెక్కిస్తున్న అహింస చిత్రం  హిట్ అవుతుందో లేదో వేచి చూడాలి.  

Also Read :  WRITER PADHMABHUSHAN REVIEW: రైటర్ పద్మ భూషణ్ రివ్యూ…కలర్ ఫోటో హీరో మరో హిట్ కొట్టాడా…?

Visitors Are Also Reading