Home » త్వరలో ఇంటర్ పరీక్షలు.. ఈ నిబంధనలు తప్పనిసరి..!!

త్వరలో ఇంటర్ పరీక్షలు.. ఈ నిబంధనలు తప్పనిసరి..!!

Ad

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు మే 6వ తేదీన మొదలవ్వనున్నాయి. ఇప్పటికే ఎగ్జామ్స్ కోసం అన్ని ఏర్పాట్లు చేసి పెట్టారు అధికారులు. దీంతో ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఉమర్ జలీల్ మాట్లాడుతూ.. విద్యార్థులకు పలు సూచనలు తెలియజేశారు. పరీక్షకు వచ్చే అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించబోమని తెలియజేశారు. ఈ విషయాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి అన్నారు.

Advertisement

Advertisement

కరోణ మరియు తీవ్రమైన ఎండలు కొడుతున్న సందర్భంగా ఇంటర్ ఎగ్జామ్స్ కోసం అన్ని ఏర్పాట్లు చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ పరీక్షలు ముగిసిన వెంటనే నెల రోజుల లోపే ఫలితాలు కూడా వెల్లడిస్తామని ప్రకటన చేశారు. ఫలితాలు వచ్చిన మరో నెల రోజుల్లో సప్లమెంటరీ పరీక్షలు కూడా నిర్వహిస్తామని తెలియజేశారు. తెలంగాణ వ్యాప్తంగా పరీక్షల కోసం 1443 సెంటర్లు ఏర్పాటు చేశామని ఈ కేంద్రాలకు ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు 6 నుంచి మే 23వ తేదీ వరకు జరుగుతాయని, ఇంటర్ సెకండియర్ పరీక్షలు 7 నుంచి ప్రారంభమై 24వ తేదీ వరకు కొనసాగుతాయని, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలకు వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తామని తెలియజేశారు. కాబట్టి ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఎవరైనా సరే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకొని, తగిన నిబంధనలు పాటించి సకాలంలో పరీక్షలు రాయాలని ఇంటర్ బోర్డు తెలియజేసింది.

ALSO READ :

తాటి ముంజల గురించి శాస్త్రవేత్తలు బయటపెట్టిన ఈ విషయం మీకు తెలుసా..?

జుట్టు రాలుతోందా.. మీ ఇంట్లో దొరికే ఆకులతో చక్కటి పరిష్కారం..!!

 

 

Visitors Are Also Reading