Home » సంగీతకు సినిమా షూటింగ్ లో అవమానం..!

సంగీతకు సినిమా షూటింగ్ లో అవమానం..!

by Azhar
Ad
గతంలో తెలుగు సినిమాలో మంచి హీరోయిన్ గా.. నటిగా సంగీత పేరు అనేది తెచ్చుకుంది. ఈమె పేరు చెప్పగానే అందరికి మొదట ఖడ్గం సినిమానే గుర్తుకు వస్తుంది అనేది తెలిసిందే. అయితే సంగీత ఉన్నట్టుండి సడెన్ గా సినిమాల నుండి తప్పుకుంది. అసలు ఎక్కడ కనిపించలేదు. కానీ 2020 లో మహేష్ బాబు హీరోగా అని రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక తల్లిగా కనిపించింది సంగీత. ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ సినిమాలో ఎక్కువగా నటిస్తుంది వస్తుంది. అలాగే బుల్లితెర కస్యాక్రమాలలో కూడా సంగీత కనిపిస్తుంది. అయితే ఈ మధ్యే సంగీత్ ఓ హర్రర్ సినిమాలో నటించింది. దాని ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు తాజాగా జరిగిన ఏ అవమానం గురించి నోరు విప్పింది సంగీత.
మొదట మహేష్ బాబు సినిమాలో నటించడం వల్ల మీకు లాభం కలిగిందా అనే ప్రశ్నకు అవును అని సమాధానం ఇచ్చింది సంగీత. ఆ తర్వాత మీకు ఎదహిన అవమానం జరిగిందా అని ప్రశ్నించగా.. ఈ మధ్యే నేను ఓ సినిమాకు ఒప్పుకున్నాను. రెండు రోజులు షూటింగ్ లో కూడా పాల్గొన్నాను. కానీ ఆ తర్వాత నాకు ఏం చెప్పకుండా నన్ను తీసేసారు అని తెలిపింది. కానీ ఆ సినిమా విషయాలు అనేవి మాత్రం బయట పెట్టలేదు సంగీత.

Advertisement

Visitors Are Also Reading