తెలుగు నాట సీనియర్ హీరోయిన్లలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి సావిత్రి. తన నటనతో మహానటి గా సావిత్రి పేరు సంపాదించుకుంది. నాటకాల నుండి సినిమాల వైపు అడుగులు వేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదరుకుని స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి అలరించింది.
Advertisement
తన టాలెంట్ తో ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. సావిత్రిలో కేవలం నటన మాత్రమే కాకుండా ఎన్నో చెప్పుకోదగ్గ ఆసక్తికర విషయాలు ఉన్నాయి. సావిత్రిది ఎడమచేతి వాటం…రాయడం సంతకాలు చేయడం ఎడమచేతితోనే చేసేవారు. అంతే కాకుండా కారును చాలా స్పీడుగా నడిపేవారు. 1963లో విడుదలైన సినిమా నర్తనశాల.
ఈ సినిమా షూటింగ్ సమయంలో మద్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 2గంటల వరకూ షూటింగ్ లో సవిత్రి పాల్గొనేవారట. షూటింగ్ తరవాత రాత్రి డ్రైవర్ ఉన్నా కూడా సావిత్రే కారును నడుపుతూ ఇంటికి వెళ్లేవారట. దాంతో చిత్రయూనిట్ సావిత్రికి తోడుగా ఎవరో ఒకరిని పంపించేవారట. ఇక సావిత్రికి తోడుగా వెళ్లినవాళ్లంతా ఆమె కారు స్పీడ్ చూసి భడపడి పోయేవారట. చాలా వేగంగా ఆమె కారును నడపటం చూసి కారులో ఆమె పక్కన కూర్చోడానికే వనికిపోయేవారట. రాత్రి సమయంలో రోడ్డు పై ఎవరూ ఉండరని కారును స్పీడుగా నడుపుతున్నారా అని అడిగితే….లేదు అవకాశం ఉన్న ప్రతిసారి కారును వేగంగానే నడుపుతాను అంటూ సావిత్రి సమాధానం ఇచ్చేవారట.
Advertisement
ఓ రోజు భరణి స్టూడియోలో సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రొడక్షన్ వారిని కారు పంపించాలని సావిత్రి కోరారు. భరణి స్టూడియో నుండి సావిత్రి ఇంటికి రావడానికి డ్రైవర్ కు 40నిమిషాలు పట్టిందట. అదే సావిత్రి కేవలం 20 నిమిషాల్లోనే ఇంటికి వెళ్లిపోయేదట. ఈ విషయాలను సావిత్రిని దగ్గర నుండి చూసిన ప్రతిఒక్కరూ చెబుతుంటారు. ఇదిలా ఉంటే సావిత్రి దర్శకత్వంలో చిన్నారిపాపలు అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా నిర్మాణంలో చాలా మంది వాటాదారులు ఉన్నారు. ఈ సినిమాకు ప్రముఖ రచయిత డీవీ నర్సరాజుతో మాటలు రాయించాలని సావిత్రి అనుకున్నారట.
కానీ అంతమంది వాటా దారులు ఉండటంతో నర్సరాజు ఈ సినిమాకు మాటలు రాసేందుకు ఒప్పుకోలేదట. అంతే కాకుండా పదిమందిని వెంటపెట్టుకుని సినిమా నిర్మాణం జోలికి వెళ్లద్దు అంటూ సావిత్రిని హెచ్చరించారట. కానీ సావిత్రి వినకుండా వాటా దారులపై నమ్మకం పెట్టుకుని ముందుకు సాగిందట. కొంతకాలం తరవాత సావిత్రికి నర్సరాజు కలిశారట. అప్పుడు మీరు చెప్పినట్టు వినలేదు. కానీ ఇప్పుడు వాటా దారులతో సమస్యలు వచ్చాయని చెప్పారట. అలకలు గొడవలు ఇవే జరుగుతున్నాయని అన్నారట. అంతే కాకుండా ఈ సినిమా కోసం సావిత్రి చివరికి తన ఆస్తులను సైతం అమ్ముకోవాల్సి వచ్చిందట.
ALSO READ :
ఆర్ఆర్ఆర్ కు మించిన స్థాయిలో అప్పట్లో వచ్చిన ఎన్టీఆర్ సినిమా అదేనా ??