ఐపీఎల్ 2022లో భారత మాజీ టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఈ ఐపీఎల్ ముందు జరిగిన మెగవేలంలో రహానేను కేకేఆర్ జట్టు కోటి రూపాయల కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే రహానేకు తిధి జట్టులో స్థానం దకుంతుందా అని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే.. రహానే దాదాపు ఏడాది కాలంగా టెస్ట్ జట్టులో దారుణంగా విఫలమవుతూ వస్తున్నాడు. దాంతో తన వైస్ కెప్టెన్సీని కోల్పోయాడు.
Advertisement
అయితే టెస్టులో విఫలమైన రహానేకు కేకేఆర్ తుది జట్టులో స్థానం దక్కింది. కానీ దానిని అతను నిలబెట్టుకోలేకపోయాడు. ఇక్కడ ఐపీఎల్ లో కూడా టెస్ట్ మాదిరిగానే ఆడుతుండటంతో అతడిని జట్టు నుండి తప్పించింది కేకేఆర్. కానీ అనంతరం ఆ జట్టుకు వరుసగా పరాజయాలు రావడంతో… తుది జట్టులో చాలా మార్పులు చేసింది. అందులో భాగంగా ఆ జట్టు ఆడిన చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు వ్యతిరేకంగా మళ్ళీ బాఱిల్కి వచ్చాడు రహానే. ఇందులో 28పరుగులు చేసిన రహానే గాయం బారిన పడ్డాడు.
Advertisement
అతనికి గ్రేడ్ 3 హమ్స్ట్రింగ్ గాయం కావడంతో.. అతను ఈ ఐపీఎల్ లో కేకేఆర్ కు మిగిలిన ఒక్క మ్యాచ్ కు అందుబాటులో ఉండడు. అయితే రహానేకు బీసీసీఐ కాంట్రాక్ట్ ఉండటంతో… తాను తప్పకుండ ఎన్సీఏ కు వేలాల్సిందే. ఇక తాజా సమాచారం ప్రకారం రహానే గాయం తగ్గడానికి కనీసం 6 వరాల సమయం పడుతుంది అని తెలుస్తుంది. దాంతో జూన్ – జూలై నెలలో భారత జట్టు వెళ్లనున్న ఇంగ్లాండ్ పర్యటనకు రహానే దూరం కానున్నాడు. ఈ పర్యటనలో 5 టీ20 మ్యాచ్ లతో పాటుగా గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ కూడా జరగనుంది. ఈ మ్యాచ్ కు రహానే అందుబాటులో ఉండకపోవచ్చు అని తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :
నేను మా సీఈవో పేరు అందుకే తీసాను : శ్రేయాస్
వంటి చేసి ఫైన్ కఠిన సంజూ, చాహల్..!