ప్రస్తుతం మన తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాదులో ఉంది కానీ, ఒకప్పుడు తెలుగు వారు అవకాశాల కోసం చెన్నైకి వెళ్లేవారు. అక్కడే చాలామంది ఇండస్ట్రీలో హీరోలుగా ఎదిగారు. ఆ తర్వాత ఇండస్ట్రీ హైదరాబాద్ తరలించి డెవలప్ చేశారు. అయితే ఇండస్ట్రీని హైదరాబాద్ తీసుకొచ్చింది ఏఎన్నార్ ఎన్టీఆర్ అని చాలామంది అనుకుంటారు. కానీ తెలుగు ఇండస్ట్రీని హైదరాబాద్ తీసుకొచ్చింది వారు కాదట.. అసలు విషయాలు బయటపెట్టిన సీనియర్ నటి జమున.. మరి ఆమె ఏమన్నారో చూద్దామా..
Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించిన జమున ముక్కుసూటిగా మాట్లాడే తత్వం. అప్పట్లో ఆమెపై అగ్ర హీరోలు సైతం బ్యాన్ విధించిన ఆమె భయపడకుండా ముందుకు వచ్చారు. అలాంటి ఆమె హైదరాబాదులో 87 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె బ్రతికున్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. అది తెలుగు ఇండస్ట్రీని హైదరాబాద్ తీసుకువచ్చింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అని అందరూ చెబుతారు కానీ అందులో వాస్తవం లేదు.
Advertisement
అసలు మొదట హైదరాబాద్ కి ఇండస్ట్రీని తెచ్చింది గంగాధర్ గారు, సారథి స్టూడియోలో మా ఇంటి మహాలక్ష్మి సినిమా షూటింగ్ హైదరాబాదులో చేశారు. ఆంధ్ర రాజధానిలో చేసినటువంటి మొదటి చిత్రం అదేనంటూ జమున తెలియజేశారు. ఆ సినిమా చేసే సమయంలో సారధి స్టూడియో పరిసరాల్లో మంచి మంచి హోటల్స్ కూడా ఉండేది. రూమ్స్ ఇస్తే అక్కడే ఉండే వాళ్ళమని చెప్పారు. కానీ వీరంతా ఇండస్ట్రీని హైదరాబాద్ తీసుకొచ్చింది మేమే అంటూ చెప్పుకుంటారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదని జమున ఖండించారు
మరికొన్ని ముఖ్య వార్తలు :
- Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు..ఆ రాశులవారు వారం మధ్యలో శుభవార్త వింటారు
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారు అన్నింటిలో విజయాలు సాధిస్తారు
- విశ్వక్ సేన్ అసలు పేరు ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..!!