టాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం తెలిసిందే. ఒక సంవత్సరం కూడా పూర్తి కాక ముందే ముగ్గురు మరణించడం గమనార్హం. ప్రస్తుతం వారి జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణ భార్య అనగానే అందరికీ విజయనిర్మల మాత్రమే తెలుసు. కానీ విజయ నిర్మల కంటే ముందే ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత తనతో పాటు పలు సినిమాల్లో కలిసి నటించిన విజయ నిర్మలను వివాహం చేసుకున్నాడు కృష్ణ .
Advertisement
విజయ నిర్మలను కృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ మొదటి భార్య ఇందిరాదేవి ఏం అనలేదు. కృష్ణ తో విడాకులు తీసుకోకుండా పిల్లల బాధ్యతను చూసుకుంది. విజయ నిర్మలతో కలిసి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు కృష్ణ. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసింది. తిరుపతిలో శ్రీవారి సమక్షంలో వీరు పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం ఇందిరా దేవికి చెప్పగా ఆమె మాట్లాడకుండా అలాగే ఉన్నారట. కృష్ణ మాటను గౌరవించి ఎలాంటి గొడవ చేయకుండానే మౌనమే అర్దాంగికారం అన్నట్టుగా అలాగే ఉండి పోయారట.
Advertisement
Also Read : కృష్ణ రెండో పెళ్లి విషయంలో ఇందిరాదేవికి తెలియకుండా తెర వెనుక మోసం చేసిన టాప్ హీరో ?
కృష్ణ రెండో వివాహం చేసుకున్నప్పటికీ ఇందిరా దేవి ఆయనతో విడాకులు తీసుకోలేదు. అంతేకాదు.. తన కుటుంబాన్ని చూసుకుంటూ మీడియాకి దూరంగా ఉన్నారు. ఏ సినిమా ఫంక్షన్ అయినా కృష్ణ విజయ నిర్మల కలిసి వచ్చే వారు. విజయనిర్మలతో ఇందిరా దేవి మాట్లాడే వారు కూడా. పలు ఫంక్షన్లలో ఇద్దరూ కలుసుకునే వారు. కృష్ణ కి విజయ నిర్మల వెన్నెముక అని తెలుసుకుని ఒప్పుకున్నారు. విజయ నిర్మలతో కృష్ణ పిల్లలను కనడానికి మాత్రం నో చెప్పారు. ఆ కండిషన్ తోనే కృష్ణ విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నారట.