ఐపీఎల్ లో ప్రతి ఏడాది కొత్త స్టార్ ఏర్పడుతారు. దేశవాళీ టోర్నీలలో ఆడి ఐపీఎల్ లో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ స్టార్ అవుతారు. అలా ఈ ఏడాది ఐపీఎల్ 2022 లో బయటకు వచ్చిన స్టార్లలో కుల్దీప్ సేన్ ఒక్కడు. రాజస్థాన్ రాయల్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి ఓవర్లో లక్నో విజయానికి 15 పరుగులు కావాలి. కానీ అప్పటికే అనుభవం గల బౌలర్ల కోటా ముగియడంతో కుల్దీప్ సేన్ చేతికి బంతి వచ్చింది. అప్పటికి క్రీజులో ఊపులో ఉన్న స్టోయినిస్ ను అద్భుతంగా కట్టడి చేసి ఆ ఆఖరి ఓవర్లో.. 11 పరుగులే ఇచ్చి రాజస్థాన్ కు విజయం అందించాడు కుల్దీప్.
Read More : అతియాను నిరాశకు గురిచేసిన రాహుల్..
Advertisement
Advertisement
మధ్యప్రదేశ్ లో జన్మించిన కుల్దీప్ తలిదండ్రులు రాంపాల్-గీతా. కుల్దీప్ తండ్రి రాంపాల్ సేన్ స్థానికంగా ఓ చిన్న హెయిర్ కటింగ్ షాప్ నడిపిస్తున్నాడు. అయితే కుల్దీప్ కు చిన్నప్పట్నుంచే క్రికెట్ అంటే ఇష్టం. క్రికెట్ మీద అతని ప్రేమను చూసి స్థానిక క్రికెట్ అకాడమీ అయిన వింద్యా క్రికెట్ అకాడమీ కుల్దీప్ దగ్గర ఫీజు తీసుకోకుండా… అతడికి కోచింగ్ కూడా ఇప్పించింది.
Read More : లంక నుంచి ఆసియా కప్ ఔట్..?
అక్కడ ఎంఓలింగ్ మెళుకువలు తెలుసుకుని కుల్దీప్ 2018 రంజీ సీజన్ లో దేశవాళీలోకి అరంగెట్రం చేసాడు కుల్దీప్. మొదటి మ్యాచ్ లోనే పంజాబ్ పై ఐదు వికెట్లు తీసి అందర్నీ ఆకర్షించాడు. దాంతి ఐపీఎల్ 2022 మెగవేలంలో అతని సామర్థ్యాన్ని గుర్తించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు… 20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే కొడుకు కుల్దీప్ సేన్ ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న సమయంలో తండ్రి రాంపాల్ సేన్ తన కటింగ్ షాప్ లోనే ఉన్నాడట..!