ఈ యేడాది ఇజ్రాయెల్ లో మిస్ యూనివర్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీలో మొత్తం 80 మంది అందెగత్తెలు వివిధ దేశాల నుండి పాల్గొన్నారు. కాగా ఈ పోటీలలో భారత్ కు చెందిన హర్నాద్ సంధు మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది. గతంలో హర్నాద్ మిస్ ఇండియా పోటీలలో రన్నరప్ గా నిలిచింది. హర్నాద్ సంధు పంజాబ్ రాష్ట్రానికి చెందిన యువతి కాగా 21 ఏళ్ల వయసులో మిస్ యునివర్స్ ను సొంతం చేసుకుంది.
Advertisement
అంతే కాకుండా ఇప్పటి వరకూ భారత్ రెండు సార్లు మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకోగా హర్నాద్ మూడో వ్యక్తిగా నిలిచింది. ఇదిలా ఉండగా 21 ఏళ్ల తరవాత మళ్లీ ఇండియాకు మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకుంది. ఇక ఇప్పటి వరకూ భారత్ నుండి మిస్ యూనివర్స్ దక్కించుకున్న అందగత్తెలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
1994లో మొదటి సారిగా మిస్ యూనివర్స్ కిరీటాన్ని సుస్మీతా సేన్ దక్కించుకుంది. సుస్మితా సేన్ 1994లోనే మిస్ ఇండియా కిరీటాన్ని కూడా దక్కించుకుంది. అంతే కాకుండా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి సుస్మితా సినిమాల్లోనూ రానించింది.
2000 సంవత్సరంలో హీరోయిన్ లారా దత్తా మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. లారా దత్తా కూడా బాలీవుడ్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాకుండా సినిమా రంగంలో ప్రతిభ కనభర్చి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.