Home » INDW vs PAKW : పాకిస్తాన్ పై భార‌త్ 11వ విజ‌యం.. వారి పాత్ర కీల‌కం..!

INDW vs PAKW : పాకిస్తాన్ పై భార‌త్ 11వ విజ‌యం.. వారి పాత్ర కీల‌కం..!

by Anji
Ad

ఐసీసీ మ‌హిళ‌ల క్రికెట్ ప్ర‌పంచ‌క‌ప్ 2022ను భార‌త్ విజ‌యంతో ప్రారంభించింది. త‌మ తొలి మ్యాచ్‌లో మిథాలీ రాజ్ నేతృత్వంలోని జ‌ట్టు పాకిస్తాన్‌ను సునాయ‌సంగా ఓడించింది.

Advertisement

తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ 244 ప‌రుగులు చేసింది. దీనికి సమాధానంగా పాక్ జ‌ట్టు కేవ‌లం 137 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. వ‌న్డే క్రికెట్‌లో పాకిస్తాన్ పై భార‌త్ కు ఇది వ‌రుస‌గా 11వ విజ‌యం 50 ఓవ‌ర్ల ఫార్మాట్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు పొరుగు దేశంతో భార‌త్ ఓడిపోలేదు. టీమిండియా విజ‌యంలో న‌లుగురు కీల‌క ఆట‌గాళ్ల‌తో ముడిప‌డి ఉంది.

పూజా వ‌స్త్రాక‌ర్‌ : ఈ ఆల్ రౌండ‌ర్ భార‌త విజ‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హరించింది. పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి భార‌త్‌ను భారీ స్కోర్ చేసేందుకు సాయం చేసింది. భార‌త జ‌ట్టు ఆరు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో పూజా తుఫాన్ బ్యాటింగ్ చేసింది. 59 బంతుల్లో ఎనిమిది పోర్ల సాయంతో 67 ప‌రుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ ఆధారంగా భార‌త జ‌ట్టు 244 ప‌రుగులకు ఆలౌట్ అయింది. స్నేహ రాణాతో క‌లిసి పూజా ఏడో వికెట్‌కు 122 ప‌రుగుల ముఖ్య‌మైన భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు.

రాజేశ్వ‌రి గైక్వాడ్ : ఈ భార‌త మ‌హిళా స్పిన్న‌ర్ భార‌త జ‌ట్టుకు ఎంత ముఖ్య‌మో రుచి చూపించింది. 10 ఓవ‌ర్ల‌లో 31 ప‌రుగులు ఇచ్చి 4 కీల‌క వికెట్లు తీసింది. దీంతో పాక్ ల‌క్ష్యాన్ని చేరుకోవాల‌న్న క‌ల చెదిరిపోయింది. ప్ర‌పంచ‌క‌ప్‌లో రాజేశ్వ‌రి గైక్వాడ్‌కు మంచి రికార్డు ఉంది. ఇది పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ కొన‌సాగింది. 38 డాట్ బాల్స్ సంధించింది. దీంతో పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచి, భార‌త్‌కు వికెట్లు అందించింది.

Also Read :  మ‌హిళ‌లు ఈ నెంబ‌ర్ సేవ్ చేసుకోండి.. ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు జ‌స్ట్ మెస్సెజ్ చేయండి..!

Advertisement

స్నేహ‌రాణా : ఈ మె భార‌త జ‌ట్టుకు చాలా కీల‌కం. ఎందుకంటే ఆమె త‌న ఆఫ్ స్పిన్‌తో 10 ఓవ‌ర్లు బౌలింగ్ చేయ‌గ‌ల సామ‌ర్థ్యంతో పాటు లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో ఉప‌యోగ‌క‌ర‌మైన ప‌రుగులు సాధించ‌గ‌ల‌దు. పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అదే ప‌ని చేసింది. స్నేహ‌రాణా ఇన్నింగ్స్‌లో 53 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచింది. ఆ త‌రువాత బౌలింగ్లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టింది. ఈ విధంగా ఆల్‌రౌండ్ ఆట‌తో భార‌త్ విజ‌యంలో నిర్ణ‌యాత్మ‌క పాత్ర పోషించింది.

స్మృతి మంధాన : భార‌త జ‌ట్టు ఓపెన‌ర్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ హాఫ్ సెంచ‌రీ చేసింది. షెఫాలీ వ‌ర్మ త్వ‌ర‌గా పెవిలియ‌న్ చేర‌డంతో 52 ప‌రుగులు సాధించి కీల‌క ఇన్నింగ్స్‌తో ఆక‌ట్టుకుంటుంది. ఈ విధంగా ఆమె ఫిప్టీతో ప్ర‌పంచ క‌ప్ 2022 ని ప్రారంభించింది. త‌న ఇన్నింగ్స్‌లో మంధాన మూడు పోర్లు, ఒక నెల‌కొల్పింది. దీంతో భార‌త్ బ‌ల‌మైన స్కోరుకు పునాది వేసింది.

ఝ‌ల‌న్ గోస్వామి : గోస్వామి త‌న చివ‌రి ప్ర‌పంచ క‌ప్‌ను ఆడుతోంది. అయితే ఆమె బౌలింగ్‌లో ఏమాత్రం వేడి త‌గ్గ‌లేద‌ని మ‌రొక‌సారి చూపించింది. 10 ఓవ‌ర్లు బౌలింగ్ చేసి 26 ప‌రుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసింది. ఝ‌ల‌న్ త‌న కోటా ఓవ‌ర్ల‌లో 42 బంతులు చేసింది. సిద్రా అమీన్‌, నిదా దార్ల వికెట్లు తీసింది. ప్ర‌పంచ క‌ప్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల‌లో ఆమె ప్ర‌స్తుతం రెండ‌వ స్థానంలో నిలిచింది. ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు ఆమె పేరు మీద 36 వికెట్లున్నాయి. అది ఇప్పుడు 38కి చేరుకుంది. మ‌రొక రెండు వికెట్లు తీస్తే మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన బౌల‌ర్గా రికార్డుల‌కెక్క‌నున్న‌ది.

Also Read :  IND Vs SL : మొహ‌లీలో లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం

Visitors Are Also Reading