Home » జ‌డ‌తో డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సు లాగి గిన్నీస్ రికార్డు.. వీడియో వైర‌ల్..!

జ‌డ‌తో డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సు లాగి గిన్నీస్ రికార్డు.. వీడియో వైర‌ల్..!

by Anji
Ad

గిన్నీస్ రికార్డు సాధించ‌డం అటే అది మామూలు విష‌యం కాదు. ఇందులో న‌మోదు కావాలంటే పెద్ద‌ చ‌రిత్ర సృష్టిస్తే కానీ సాధ్యంకాదు. కానీ జ‌డ‌తో బ‌స్సును లాగ‌డం ఎంతో ప్రాక్టీస్ ఉంటే కానీ సాధ్యం కాదు. అది ఒక పెద్ద సాహ‌స‌మే అని చెప్పాలి. సాహ‌సం క‌న్నా అసాధ్యం అని కూడా చెప్పుకోవ‌చ్చు. కానీ పంజాబ్‌కు చెందిన ఆశారాణి అనే మ‌హిళ త‌న జ‌డ‌తో డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సును సున‌యాసంగా లాగింది. ఈ బ‌స్సు బ‌రువు అక్ష‌రాల 12,126 కేజీలు. అన్నీ వాహ‌నాల‌లో అత్యంత బ‌రువు ఉన్న వాహ‌నం దీనిని త‌న జ‌డ‌తో లాగి గిన్నీస్ రికార్డు క్రియేట్ చేసింది ఆశారాణి.

Guinness World Record: జ‌డ‌తో బ‌స్సును లాగింది.. గిన్నిస్‌ బుక్‌లో రికార్డ్‌ సృష్టించింది

Advertisement

Advertisement

అంత బ‌రువు ఉన్న బ‌స్సును అవ‌లీల‌గా త‌న జ‌డ‌తో లాగి గిన్నీప్రపంచ రికార్డును క్రియేట్ చేసిన‌ది. ఆశారాణికి ఐర‌న్ క్వీన్ అనే బిరుదును గిన్నీస్ వ‌ర‌ల్డ్ ప్ర‌తినిధులు ఇచ్చారు. అయితే 2016లోనే ఆశా ఇటలీలో ఈ ఫీట్ సాధించింది. అయితే తాజాగా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారింది.

Asha Rani, An Indian Woman, Uses Hair To Pull Heavy Vehicle, Creates World Record. Drop That Haircare Routine, Champ! - Flipboard

రాణి గిన్నిస్ రికార్డు సృష్టించ‌డం ఇది తొలిసారి ఏమి కాదు. ఇంత‌కు ముందే ఏడు గిన్నీస్ రికార్డుల‌ను సృష్టించింది. ఆమె పళ్ల‌తో 22.16 సెక‌న్ల కాలంలోనే ఓ కారును 25 మీటర్ల దూరం లాక్కెల్లింది. త‌న చెవుల‌తో 1700 కిలోల బరువు ఉన్న వాహ‌నాన్ని లాగి రికార్డు సృష్టించింది. ఈ రికార్డును సృష్టించి రికార్డుల‌న్నింటి బ‌ద్ద‌లు కొట్టింది.

Visitors Are Also Reading