Home » పాకిస్తాన్‌లోకి దూసుకెళ్లిన సూప‌ర్ సోనిక్ మిస్సైల్‌..ఏమి జ‌రిగిందంటే..?

పాకిస్తాన్‌లోకి దూసుకెళ్లిన సూప‌ర్ సోనిక్ మిస్సైల్‌..ఏమి జ‌రిగిందంటే..?

by Anji
Published: Last Updated on
Ad

భార‌త ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌కు చెందిన మిస్సైల్ పొర‌పాటున పాకిస్తాన్ భూభాగంలోకి దూసుకెళ్లింది. రోజువారి ప‌రీక్ష‌లో భాగంగా భార‌త్ ప్ర‌యోగించిన క్షిప‌ణిలో సాంకేతిక లోపం త‌లెత్త‌డం వ‌ల్ల పాకిస్తాన్ వైపు దూసుకెళ్లిన‌ట్టు రక్ష‌ణ శాఖ వెల్ల‌డించింది. ఈనెల 9న జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌రుగ‌లేద‌ని స్పందించింది.

Advertisement

ఈ విష‌యాన్ని తేలిక‌గా తీసుకోవ‌డం లేద‌ని, దీనిపై అత్యున్న‌త స్థాయి విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్టు ప్ర‌క‌టించింది. పాక్ భూభాగంలో మిస్సైల్ ప‌డ‌డంపై విచారం వ్య‌క్తం చేసింది. అంత‌కుముందు భార‌త్‌కు చెందిన ఓ గుర్తు తెలియ‌ని ప్ల‌యింగ్ ఆబ్జెక్ట్ త‌మ భూభాగంలో ప‌డింద‌ని పాక్ ఆరోపించింది. 40వేల అడుగుల ఎత్తులో ప్ర‌యాణించిన ఈ అనుమాన‌స్ప‌ద ప‌రిక‌రం.. 207 కిలోమీట‌ర్లు దూసుకెళ్లి మియాన్ చ‌న్నూ న‌గ‌రంలో కుప్ప కూలిన‌ట్టు వెల్ల‌డించింది.

Advertisement

పాకిస్తాన్ గ‌గ‌న‌త‌ల స‌రిహ‌ద్దును ఉల్లంఘించార‌ని నిర‌సిస్తూ భార‌త రాయ‌బారికి అక్క‌డి విదేశాంగ శాఖ స‌మ‌న్లు జారీ చేసింది. క్షిప‌ణి ప్ర‌యోగం పాక్‌లోని పౌరుల ఆస్తుల‌కు న‌ష్టం క‌లిగించ‌డం స‌హా ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురి చేసిందని భార‌త రాయ‌బారికి పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఫిర్యాదు చేసింది. త‌మ గ‌గ‌న త‌లంలోకి క్షిప‌ణి రావ‌డం ప‌ట్ల విమాన ప్ర‌యాణాల‌కు తీవ్ర ఆటంకం క‌లిగింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది పాకిస్తాన్‌.

Visitors Are Also Reading