Home » Rohit Sharma : 200 స్పీడ్‌తో రోహిత్‌ ర్యాష్‌ డ్రైవింగ్..లక్షల్లో జరిమానా విధించిన పోలీసులు!

Rohit Sharma : 200 స్పీడ్‌తో రోహిత్‌ ర్యాష్‌ డ్రైవింగ్..లక్షల్లో జరిమానా విధించిన పోలీసులు!

by Bunty
Ad

క్రికెట్ లో దూకుడు అవసరం. ప్రత్యర్థులను భయపెట్టడానికి బాగుంటుంది కానీ క్రిజ్ బయట అంత దూకుడుగా ఉంటే అది చాలా చాలా డేంజరస్. సరిగ్గా ఇలాంటి అనుభవమే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఎదురైంది. కూల్ గానే కనిపిస్తాడు ఎవరితో గొడవ పెట్టుకొని ఉంటాడు అని ఆలోచిస్తున్నారా? ఇది అలాంటి వివాదం కాదు. బంగ్లాదేశ్ తో ప్రపంచకప్ మ్యాచ్ కి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పీడ్ డ్రైవింగ్ వివాదంలో చిక్కుకున్నాడు.

Indian cricket captain Rohit Sharma fined 3 times after caught speeding at over 200 Kmph in Lamborghini Urus SUV

Indian cricket captain Rohit Sharma fined 3 times after caught speeding at over 200 Kmph in Lamborghini Urus SUV

ముంబై, పూణే మధ్య రద్దీగా ఉండే హైవే మీద రోహిత్ శర్మ నడుపుతున్న లంబోర్ఘిని కారు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించడాన్ని పోలీసులు గుర్తించారు. ఒకానొక దశలో ఈ కారు అత్యధికంగా 215 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కూడా అందుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వేర్వేరు ప్రదేశాల్లో పరిమితికి మించిన వేగంతో కారును నడిపినందుకు డ్రైవింగ్ చేస్తున్న రోహిత్ శర్మకు పోలీసులు మూడు చలానాలను పంపించారు.

Advertisement

Advertisement

గత ఏడాది డిసెంబర్లో కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. దీనివల్ల అతని కెరీర్ కు దాదాపు ఏడాదిన్నర నుంచి రెండేళ్లపాటు బ్రేక్ పడింది. ఇలాంటి ఘటనలను గుర్తుపెట్టుకుని కారు డ్రైవింగ్ చేసే వాళ్ళు వేగాన్ని అదుపులో ఉంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading