Mukesh Kumar : ఇండియా ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇటీవల కాలంలోనే టీమిండియాలోకి వచ్చాడు ముఖేష్ కుమార్. అయితే తాజాగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ ఓ ఇంటి వాడు అయ్యాడు. ఇటీవల కాలంలో టీమిండియా ప్లేయర్స్ వరుసగా పెళ్లి చేసుకుంటున్నారు. మొదటగా అక్షర్ పటేల్… ఆ తర్వాత టీమిండియా వైస్ కెప్టెన్ కె.ఆర్ రాహుల్ పెళ్లి చేసుకున్నారు.
అయితే తాజాగా టీమిండియా పేస్ బౌలర్ ముఖేష్ కుమార్ కూడా పెళ్లి చేసుకున్నాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన తన చిన్ననాటి స్నేహితురాలు దివ్య సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ముఖేష్ కుమార్. ఇంట్లో పెద్దవారు కూడా ఒప్పుకోవడంతో…. నిన్న మంగళవారం రోజున ముఖేష్ కుమార్ మరియు దివ్య సింగ్ వివాహం చాలా గ్రాండ్గా జరిగింది. వీరి పెళ్లికి ముఖేష్ కుమార్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు మరియు టీమ్ ఇండియా ప్లేయర్స్ కూడా హాజరు అయినట్లు సమాచారం అందుతుంది.
Advertisement
Advertisement
దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన క్రికెట్ ఫ్యాన్స్… టీమిండియాలోకి వచ్చి రాగానే పెళ్ళికొడుకు అయ్యాడని ముఖేష్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక డిసెంబర్ 4వ తేదీన వీరి రిసెప్షన్ జరగనుంది. తన వివాహం ఉన్న నేపథ్యంలో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడవ టి20 మ్యాచ్ కు దూరమయ్యాడు ముఖేష్ కుమార్.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.