Home » పాక్ ఖ‌ర్జూరంపై భార‌త్ 200 శాతం ప‌న్ను.. వ్యాపారుల‌కు న‌ష్టం ఎంతంటే..?

పాక్ ఖ‌ర్జూరంపై భార‌త్ 200 శాతం ప‌న్ను.. వ్యాపారుల‌కు న‌ష్టం ఎంతంటే..?

by Anji
Ad

పాకిస్తాన్ దేశంలోని ఖైపూర్‌లో ప్రాంతంలో అత్య‌ధికంగా ఖ‌ర్జూరం పండిస్తారు. ఆ ప్రాంతం స‌ముద్రానికి దూరంగా ఉండ‌డం, తేమ లేక‌పోవ‌డం, అధిక ఉష్ణోగ్ర‌త కార‌ణంగా ఈ పంట పండించేందుకు ఇక్క‌డ అనుకూలంగా ఉంఉటంది. ఫిబ్ర‌వ‌రి నుంచి ఖ‌ర్జూరం కాయ‌డం మొద‌లై.. జూన్ నాటికి పూర్తిగా పండుతాయి. దానిని ఖ‌ర్జూరం ప‌ళ్ల‌లా చేయాలా లేదా ఎండు ఖ‌ర్జూరం చేయాలా అనేది రైతు ఇష్టంపై ఆధార‌ప‌డి ఉంటుంది. మార్కెట్ ధ‌ర‌, కాలానిక‌నుగుణంగా రైతుదీనిని నిర్ణ‌యిస్తారు. అయితే పాకిస్తాన్, భార‌త్ ల మ‌ధ్య నెల‌కొన్న సంబంధాల‌తో ఈ ప్ర‌క్రియ‌లో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి.

Sp Natural Dry Dates - Yellow [Sukha/Pila Chuara/Endu Kharjuram/Kharik]  Fresh Quality 100% - 400 Gram : Amazon.in: Grocery & Gourmet Foods

Advertisement

గులాం ఖాసిం జ‌స్కాని ఖైర్‌పూర్‌కు చెందిన అభ్యుద‌య రైతు. భార‌త్ పాకిస్తాన్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త సంబంధాలు చిన్న రైతులపై తీవ్ర ప్ర‌భావం చూపించాయ‌ని పేర్కొన్నారు. ఎండు ఖ‌ర్జూరం ధ‌ర త‌గ్గిపోయింది. 2019లో బాలాకోట్ దాడి త‌రువాత భార‌త్-పాకిస్తాన్ మ‌ధ్య మ‌రొక‌సారి ఉద్రిక్త‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఇరు దేశాల ప‌ర‌స్ప‌ర సంబంధాలు తెంచుకొన.. వాఘా స‌రిహ‌ద్దు మీదుగా జ‌రిగే వాణిజ్యాన్ని ఆపేసాయి.

Advertisement

సుక్కూర్‌లో ఉన్న అత్యంత పెద్ద ఖ‌ర్జూరం మార్కెట్‌. ఇక్క‌డ ఖ‌ర్జూరాన్ని బ‌లూచిస్తాన్‌తో పాటు ద‌గ్గ‌ర‌లో ఉన్న ప్రాంతాల నుంచి కూడా కొనుగోలు చేసి అమ్ముతారు. ఈ మార్కెట్ నుంచే భార‌త్‌తో పాటు ఇత‌ర దేశాల‌కు కూడా ఎగుమ‌తి చేస్తారు. పాకిస్తాన్ 55 ల‌క్ష‌ల ట‌న్నుల ఖ‌ర్జూరాన్ని ఉత్ప‌త్తి చేస్తోంద‌ని పాకిస్తాన్ ఆహార మంత్రిత్వ శాఖ గ‌ణాంకాలు చెబుతున్నాయి. స‌గం పంట సింధ్ ప్రాంతంలోనే పండిస్తారు. మార్కెట్‌లో ప్ర‌తి ఏటా 22 ల‌క్ష‌ల సంచులు, 400,000 క్రేట్ల ఖ‌ర్జూరం కొనుగోలు చేస్తారు.

అయితే వాఘా స‌రిహ‌ద్దును మూసిన త‌రువాత ఎండు ఖ‌ర్జురాల‌ను ఎగుమ‌తి చేసేందుకు వ్యాపారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను చూసుకోవాల్సి వ‌చ్చింది. పాకిస్తాన్‌లో ఉత్ప‌త్తి అయ్యే అన్ని వ‌స్తువుల‌పై భార‌త్ 200 శాతం ప‌న్ను విధిస్తోంది. మోస్ట్ ఫేవ‌ర్డ్ నేష‌న్ అవార్డును కోల్పోయిన త‌రువాత పాకిస్తాన్ నుంచి ఖ‌ర్జూరం ఎగుమ‌తి వ్యాపారులు ఒక్క 2021లోనే 10 కోట్ల డాల‌ర్ల‌ను న‌ష్ట‌పోయారని నేష‌న‌ల్ అసెంబ్లీ ఆప్ పాకిస్తాన్ స్టాండింగ్ క‌మిటీ చెప్పింది. ఇత‌ర దేశాల్లో కొత్త మార్కెట్‌ల‌ను చూపించ‌మ‌ని ఈ క‌మిటీ ప్ర‌భుత్వాన్ని కోరింది.

పాకిస్తాన్ నుండి దిగుమ‌త‌య్యే ఖ‌ర్జూరంపై ప‌న్ను విధించిన త‌రువాత భార‌త్ మార్కెట్ లోకూడా దీని ధ‌ర భారీగానే పెరిగింది. ఈ పరిస్థితిలో పాకిస్తాన్ రైతులు ఇరు దేశాల్లో ఉన్న వ‌ర్త‌కులు న‌ష్టాల‌ను ఎదుర్కుంటున్నారు. మ‌రొక‌వైపు థ‌ర్డ్ పార్టీలుగా వ్య‌వ‌హ‌రిస్తున్న దేశాలు లాభాలు పొందుతున్నాయి.

Visitors Are Also Reading