Home » అంతర్జాతీయ విమానాల‌పై ఆంక్ష‌లు మ‌ళ్లీ పొడిగింపు

అంతర్జాతీయ విమానాల‌పై ఆంక్ష‌లు మ‌ళ్లీ పొడిగింపు

by Anji
Ad

ఓ వైపు క‌రోనా, మ‌రొక‌వైపు దాని వేరియంట్ అయిన ఒమిక్రాన్ రోజు రోజుకు పెరుగుతున్న వేళలో అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై ఆయా దేశాలు నిషేదాజ్ఞ‌లు విధిస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. ఈ స‌మ‌యంలోనే ఐరాపా దేశాలు ఒమిక్రాన్ ధాటికి త‌ల్ల‌డిల్లిపోతున్నాయి. ఒమిక్రాన్ కార‌ణంగా ప‌లు దేశాలు ఆంక్ష‌లు విధించాయి. ముఖ్యంగా విదేశీ ప్ర‌యాణాల‌పై నిషేదం అమ‌లు చేస్తున్నాయి.

India extends ban on international commercial flights till Feb 28- The New Indian Express

Advertisement

భార‌త్ కూడా విదేశీ రాక‌పోక‌లపై నిషేదం విధించింది. ఈ నిషేదం జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు అమ‌లులో ఉండ‌నున్న‌ది. విదేశాల్లో కేసులు ఎక్కువ‌గా న‌మోదు అవుతుండ‌టంతో భార‌త్ అల‌ర్ట్ అయింది. ఈ నిషేదాన్ని మ‌రొక నెల రోజుల పాటు పొడిగించింది. ఫిబ్ర‌వ‌రి 28 వ‌ర‌కు అమ‌లులో ఉంటాయ‌ని భార‌త ప్ర‌భుత్వం పేర్కొంది.

Advertisement

క‌రోనా కార‌ణంగా 2020 మార్చి నుంచి విదేశీ విమానాల‌ను క‌ట్టి చేసింది భార‌త్‌. ఆ త‌రువాత కొద్ది రోజుల‌కు స్వ‌దేశీ విమాన‌యానాన్ని కూడా నిలిపివేసింది. విదేశాల్లో చిక్కుకుని పోయిన భార‌తీయుల‌ను స్వ‌దేశానికి ర‌ప్పించేందుకు 2020 జులై నెల నుంచి వందే భార‌త్ మిష‌న్ కార్య‌క్ర‌మం పేరిట విదేశాల‌కు విమాన స‌ర్వీసులు న‌డిపింది. ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా పెరుగుతున్న త‌రుణంలో తాజాగా నిషేధం విధించింది. ఈ నిషేదంతో విమానయాన సంస్థ‌లు మ‌రింత‌గా న‌ష్టపోయే అవ‌కాశం ఉన్న‌ట్టు నిపుణులు పేర్కొంటున్నారు.

Visitors Are Also Reading