మహిళల టీ-20 అండర్ 19 ప్రపంచ కప్ లో భారత్ దుమ్ము రేపుతోంది. యునైటేడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి భారత మహిళల జట్టు 219 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో అండర్-19 ప్రపంచ కప్ లో 200 పరుగులు చేసిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.
Advertisement
Advertisement
టీమిండియా బ్యాటర్లలో కెప్టెన్ షెఫాలీ వర్మ 34 బంతుల్లో 78, శ్వేత 49 బంతుల్లో 74 పరుగులు, రిచా ఘోష్ 29 బంతుల్లో 49 పరుగులు సాధించారు. ఆ తరువాత 220 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 97 పరుగులు మాత్రమే చేసింది. భారత్ మహిళల జట్టు 122 పరుగుల భారీ తేడాతో విజయకేతనం ఎగురవేసింది.
Also Read : Women IPL : మహిళల ఐపీఎల్..భారీ ధరకు మీడియా హక్కులు దక్కించుకున్న వైకొమ్ 18
ఇక ఈ మ్యాచ్ లో 34 బంతుల్లో 78 పరుగులు చేసిన షఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. బౌలింగ్ లోనూ షఫాలీ వర్మ రాణించింది. రెండు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చింది. షబ్నామ్, సధు, కశ్యప్, చోప్రా తలో వికెట్ సాధించారు. దీంతో మహిళల అండర్ -19 ప్రపంచ కప్ లో భారత్ చరిత్ర సృష్టించిందనే చెప్పవచ్చు.
Also Read : లైవ్ మ్యాచ్ లో కోహ్లీ కాళ్లు పట్టుకున్న వీరాభిమాని.. ఫ్యాన్స్ మనస్సు గెలుచుకున్న సూర్య..!