Home » INDIA CORONA UPDATE : 24గంట‌ల్లో 8,439కేసులు..195మ‌ర‌ణాలు..!

INDIA CORONA UPDATE : 24గంట‌ల్లో 8,439కేసులు..195మ‌ర‌ణాలు..!

by AJAY

దేశంలో క‌రోనా కేసుల పెరుగుద‌ల త‌గ్గుద‌ల క‌నిపిస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గి కేసులు మ‌ళ్లీ పెర‌గ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. 6వేల నుండి 7వేల వ‌రకు ప‌డిపోయిన కేసుల్లో ఇప్పుడు మ‌ళ్లీ పెరుగుద‌ల క‌నిపిస్తోంది. తాజాగా దేశంలో 8349 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అదేవిధంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 9,525 క‌రోనా నుండి కోలుకున్నారు. ఇక క‌రోనా కార‌ణంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 195 మంది మృతి చెందారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ దేశంలో మొత్తం 3,40,89,137 మంది క‌రోనా నుండి కోలుకున్నారు. 4,73,952 మంది ప్ర‌జ‌ల‌కు క‌రోనా కాటుకు భ‌ల‌య్యారు. ఇదిలా ఉంటే దేశంలో మ‌రోవైపు ఒమిక్రాన్ మ‌హ‌మ్మారి సైతం క‌ల‌క‌లం రేపుతోంది.

INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

మొద‌ట ఒక‌టి రెండుగా న‌మోదైన కేసులు ఇప్పుడు మొత్తం 28కి చేరుకున్నాయి. దాంతో ఇప్ప‌టికే కేంద్ర వైద్యారోగ్య‌శాఖ అప్ర‌మ‌త్తం అయ్యింది. ఒమిక్రాన్ ప‌ట్ల ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెబుతోంది. మాస్క్ లు ధ‌రించాల‌ని..శానిటైజ‌ర్లు రాసుకుంటూ ప్ర‌జార‌వాణాలో ప్రోటోకాల్స్ పాటించాల‌ని కోరింది. అంతే కాకుండా ఒమిక్రాన్ తో థ‌ర్డ్ వేవ్ వ‌చ్చే అవ‌కాశాల‌ను కూడా కొట్టిపారేయ‌లేమ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇక క‌రోనా నేప‌థ్యంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ 129.5 కోట్ల డోసుల వ్యాక్సిన్ లు వేశారు.

ALSO READ : BIGG BOSS- 5: స‌న్నీకి నేను అత్త‌ను…నా కూతురును ఇద్దామ‌నుకున్నా కానీ : ఉమాదేవి

దేశంలో ఫ‌స్ట్ డోస్ వేసుకున్న వారి సంఖ్య ఎక్కువ‌గానే ఉండ‌గా సెకండ్ డోస్ విష‌యంలో మాత్రం ప్ర‌జ‌లు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేద‌ని కేంద్రం పేర్కొంది. అవ‌స‌ర‌మైతే హెల్త్ వ‌ర్క‌ర్ ల‌కు మూడో డోస్ వ్యాక్సిన్ కూడావేయాల‌నే ఆలోచ‌న చేయాల‌ని నిన్ని ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ కేంద్రానికి స‌ల‌హా ఇచ్చింది. అలాగే ఇమ్యునిటి త‌క్క‌వ ఉన్నవారికి కూడా మూడో డోసు ఇవ్వాల‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం ఇండియాలో 93,733 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

Visitors Are Also Reading