Telugu News » భారత టీ20 కెప్టెన్ గా రాహుల్.. టెస్ట్ కెప్టెన్ గా రోహిత్..!

భారత టీ20 కెప్టెన్ గా రాహుల్.. టెస్ట్ కెప్టెన్ గా రోహిత్..!

by Manohar Reddy Mano

ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడుతున్న భారత ఆటగాళ్లు.. ఇది ముగిసిన తర్వాత ఇండియాకు వస్తున్న సౌత్ ఆఫ్రికా జట్టుతో 5 టీ20ల సిరీస్ లో పాల్గొనాలి. దీని అనంతరం ఇంగ్లాండ్ తో గత ఏడాది మిగిలిన టెస్ట్ సిరీస్ లో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే ఈ రెండు సిటీస్ లకు తాజాగా బీసీసీఐ జట్టును ప్రకటించింది. అందులో టీ20 సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా వంటి సీనియర్లకు రెస్ట్ ఇచ్చి ఐపీఎల్ లో రాణిస్తున్న యువకులతో పాటుగా దినేష్ కార్తీక్ ను కూడా ఎంపిక చేసింది. ఇక రోహిత్ లేకపోవడంతో టీ20 కెప్టెన్ గా కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ గా పంత్ ను ప్రకటించింది. అలాగే టెస్టులకు మళ్ళీ ఆందరూ ఆటగాళ్లు జట్టులో వస్తుండటంతో రోహిత్ ను కెప్టెన్ గా… కేఎల్ రాహుల్ ను వైస్ కెప్టెన్ గా ఎంచుకుంది.

Ads

సౌత్ ఆఫ్రికాతో ఆడే భారత టీ20 జట్టు : కేఎల్ రాహుల్ (C), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (VC,wK), దినేష్ కార్తీక్ (wK), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, వై చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఆర్ బిష్ణోయ్ , భువనేశ్వర్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

ఇంగ్లాండ్ తో ఆడే టెస్ట్ జట్టు : రోహిత్ శర్మ (C), కెఎల్ రాహుల్ (VC), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, ఛెతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (wK), కెఎస్ భరత్ (wK), ఆర్ జడేజా, ఆర్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ , జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రసిద్ కృష్ణ

ఇవి కూడా చదవండి :

అర్జున్ కు ఈ సీజన్ కూడా నిరాశే.. సీరియస్ అవుతున్న అభిమానులు..!

క్రికెటర్ భార్య పైన గవాస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్…!


You may also like