Home » IND Vs SL : రెండో వన్డేలో టీమిండియా విక్టరీ.. మ్యాచ్ హైలెట్స్ ఇవే..! 

IND Vs SL : రెండో వన్డేలో టీమిండియా విక్టరీ.. మ్యాచ్ హైలెట్స్ ఇవే..! 

by Anji
Ad

భారత్ శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది.  దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0తో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. తొలుత శ్రీలంక నిర్దేశించిన 216 పరుగల లక్ష్యాన్ని భారత్ 43.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక బ్యాటింగ్ లో కే.ఎల్. రాహుల్ (64) పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను విజయ పథంలోకి నడిపించాడు. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (36), శ్రేయస్ అయ్యర్ (28), గిల్ (21), అక్షర్ (21) పర్వాలేదనిపించారు.

Advertisement

ఇక బౌలింగ్ లో మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్  అద్భుతంగా బౌలింగ్ చేశారు. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీశాడు. అయితే తొలి వన్డేలో రాణించిన సిరాజ్ రెండో మ్యాచ్ లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ప్రధానంగా పవర్ ప్లే లో ప్రత్యర్థుల వికెట్లను తీస్తున్నాడు. తాజాగా జరిగిన  మ్యాచ్ లో పవర్ ప్లే లోనే సిరాజ్ తన మూడో ఓవర్ లో ఆవిష్క ఫెర్నాండో ను క్లీన్ బౌల్డ్ చేశాడు. గత మ్యాచ్ లో కూడా పవర్ ప్లేలో ఫెర్నాండో వికెట్ పడగొట్టగా.. కుశాల్ మెండిస్ బౌల్డ్ అయ్యాడు. 

Advertisement

 

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ సత్తా చాటాడు. కేవలం 5 ఓవర్లు మాత్రమే వేసినప్పటికే కీలకమైన ధనుంజయ డిసిల్వాను అద్భుతంగా బౌల్డ్ చేసాడు. ఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ లో కూడా అదురగొట్టాడు అక్షర్. మొత్తం  మూడు క్యాచ్ లు అందుకున్నాడు. చమికా కరుణ రత్నే క్యాచ్ పట్టడం మ్యాచ్ కే హైలెట్ అని చెప్పాలి. ఉమ్రాన్ మాలిక్ వేసిన బంతిని కరుణ రత్నే పాయింట్ ఏరియా వైపునకు ఆడగా.. అక్కడే ఉన్నటువంటి అక్షర్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. బంతి చాలా వేగంగా వచ్చినప్పటికీ ఎడమవైపు డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. 

Also Read :   క్రికెటర్ కే.ఎల్. రాహుల్ పెళ్లి ఎప్పుడో తెలుసా..?

Visitors Are Also Reading